Friday, August 2, 2013

రాగం తీసే కోయిలా

చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
గీతరచయిత: వేటూరి
నేపథ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా

బాసలెన్నొ చేసుకున్న ఆశే మాయెగా
బాసలెన్నొ చేసుకున్న ఆశే మాయెగా
పిలవని.. పిలుపుగా ..రాకే నీవిలా

రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా

చరణం 1:

జంటని ఎడబాసినా.. ఒంటరి నా బ్రతుకునా
మల్లెల సిరివెన్నెల.. మంటలు రేపగా...

వయసుల నులి వెచ్చని.. వలపుల మనసిచ్చిన
నా చెలి చలి వేణువై.. వేదనలూదగా...

తొలకరీ పాటలే.. తోటలో పాడకే.. పదే పదే పదే పదాలుగా

రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా

చరణం 2:

పగిలిన నా హృదయమే.. రగిలెనే ఒక రాగమై
అడవిలో వినిపించిన.. ఆమని పాటగా...

అందమే నా నేరమా.. పరువమే నా పాపమా
ఆదుకోమని చెప్పవే.. ఆఖరి మాటగా...

గుండెలో మురళిని.. గొంతులో ఊదకే.. పదే పదే పదే పదాలుగా...

రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా





https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5057

No comments:

Post a Comment