Thursday, August 1, 2013

నిదరోయే నదులన్ని


చిత్రం: నాగమల్లి (1980)

సంగీతం: రాజన్-నాగేంద్ర

గీతరచయిత: వేటూరి

నేపథ్య గానం: బాలు 


పల్లవి:



నిదరోయే నదులన్ని...

నిదరోయే నదులన్ని కదలిన అలజడిలో

సందె గాలులే సన్నాయి పాట పాడాలి

ఆ పాట విన్న నాగమల్లి తోట నవ్వాలి



ఝుమ్మని పాడుతు తుమ్మెదలాడగా

గువ్వలు రివ్వున గుస గుసలాడగా

సందె గాలులే సన్నాయి పాట పాడాలి

ఆ పాటవిన్న నాగమల్లి తోట నావ్వాలి....



చరణం 1:



పాటలలోన సిరి పైటలలోన...

మెరిసిన రాగం ఉరిమిన తాళం... కలిసే వేళా..ఆ...


తోటలలోన తొలి పూతలలోన...

కురిసిన అందం కుసుమ పరాగం...విరిసే వేళా

లాలనగా ఆలాపనగా....ప్రాణము వేణువులూదెనులే


సందె గాలులే...సన్నాయి పాట పాడాలి

ఆ పాట విన్న నాగమల్లి తోట నవ్వాలి


చరణం 2:



కోనలలోన జడివానలలోన...

సెలల తరంగం అలల మృదంగం... పలికే వేళా..


వేణువులోని పద రేణువులెన్నో...

విన్న మయూరం విరుపు వయారం...చిలికే వేళా


గాలుల ఈలల ఏలలలో...

నా యెద ఎల్లువ లాయెనులే....

లాల్ల...లాలా...లాల్ల..లాల... 



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5058

No comments:

Post a Comment