Monday, August 5, 2013

నిను చూడక నేనుండలేనూ


చిత్రం: నీరాజనం (1988) 
సంగీతం: ఓ.పి. నయ్యర్ 
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, జానకి 

పల్లవి : 

ఆ..హాహాహా..ఆ..హాహాహా 
ఓహో ఓహో ఓహో 

నిను చూడక నేనుండలేనూ..ఊ.. 
నిను చూడక నేనుండలేనూ 
ఈ జన్మలో మరి ఆ జన్మలో 
ఈ జన్మలో మరి ఆ జన్మలో 
ఇక ఏ జన్మకైనా ఇలాగే..ఏ 
నిను చూడక నేనుండలేనూ..ఊ.. 
నిను చూడక నేనుండలేనూ 

చరణం 1 : 

ఆ..హాహాహా..ఆ..హాహాహా 
ఆ..హాహాహా ఓ హోహో 
ఆ..హాహాహా ఓ హోహో 
ఓ హోహో ఆ..హాహాహా 

ఏ హరివిల్లు విరబూసినా 
నీ దరహాసమనుకుంటినీ 
ఏ చిరుగాలి కదలాడినా 
నీ చరణాల శృతి వింటినీ 
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో 
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో 

నిను చూడక నేనుండలేనూ 
నిను చూడక నేనుండలేనూ 
ఈ జన్మలో మరి ఆ జన్మలో 
ఈ జన్మలో మరి ఆ జన్మలో 
ఇక ఏ జన్మకైనా ఇలాగే..ఏ 
నిను చూడక నేనుండలేనూ..ఊ.. 
నిను చూడక నేనుండలేనూ 

చరణం 2: 

ఓ హోహో ఆ..హాహాహా 
ఆ..హాహాహా..ఆ..హాహాహా 
ఆ..హాహాహా..ఆ..హాహాహా 
ఆ..హాహాహా ఓ హోహో 

నీ జతగూడి నడియాడగా 
జగమూగింది సెలయేరుగా 
ఒక క్షణమైన నిను వీడినా 
మది తొణికింది కన్నీరుగా 
మన ప్రతి సంగమం 
ఎంత హృదయంగమం 
మన ప్రతి సంగమం 
ఎంత హృదయంగమం 

నిను చూడక నేనుండలేనూ..ఊ.. 
నిను చూడక నేనుండలేనూ 
ఈ జన్మలో మరి ఆ జన్మలో 
ఈ జన్మలో మరి ఆ జన్మలో 
ఇక ఏ జన్మకైనా ఇలాగే..ఏ 
నిను చూడక నేనుండలేనూ 
నిను చూడక నేనుండలేనూ 
నిను చూడక నేనుండలేనూ..ఊ.. 
నిను చూడక నేనుండలేనూ



5 comments:

  1. ఈ గీత రచన చేసింది డా. సి.నారాయణ రెడ్డి గారు అనుకుంటాను. సరి చూడగలరు.

    ReplyDelete
  2. If you don’t mind one more please — “నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో”.

    ReplyDelete
    Replies
    1. మహేష్ గారు! చాలా థాంక్స్ అండి. సాహితీపరంగా దొర్లుతున్న ఈ పొరపాటులను మా దృష్టికి తీసుకొస్తొనందుకు మీకు అభినందనలు. మేము వెంటనే సరిదిద్దుతాము. :)

      Delete