Saturday, August 3, 2013

రాగమో అనురాగమో

చిత్రం: నాలుగు స్తంభాలాట (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
గీతరచయిత: వేటూరి
నేపథ్య గానం: బాలు, జానకి


పల్లవి:

హే..హే..హే..హే..హే..హే..
లలలల..హే..హే..
రాగమో అనురాగమో..గీతమో సంగీతమో...
నా గుండెలో ఓ కోయిలా..పూదండలో సన్నాయిలా
వలచీ పిలిచే... మత్తుగా కొత్తగా
లవ్ మీ... లవ్ మీ!

రాగమో అనురాగమో..గీతమో సంగీతమో..
నా గుండెలో ఓ కోయిలా.. పూదండలో సన్నాయిలా..


చరణం 1:


సూరీడు చల్లారు నీ చూపూ... చలిగాలిలా వీచే నా వైపూ..
పరుగెత్తే పరువంలోనా... పడగెత్తే ప్రణయంలాగ... సాగిపోవాలి జతగా...

నీ కంటిలో ఉన్న చలిమంటా... తొలిగంట కొట్టింది నా కంట
పయనించే జవనంలోనా... పలికే ఋతుపవనం లాగా... జల్లు రావాలి వడిగా 

ఈ వడిలో... ఉరవడిలో... ముడివడి పోవాలీ..
కాలమెంత దూరమో కలిసి చూడగా 


రాగమో అనురాగమో..గీతమో సంగీతమో..
నా గుండెలో ఓ కోయిలా..పూదండలో సన్నాయిలా..


చరణం 2:


సందెల్లో మందార బొట్టుందీ... అందాల ముద్దిచ్చి అంటింది..
సెలయేటి అలజడిలోనా... చెలరేగే అల్లరిలాగా..ఊగిపోవాలి కలిసీ...

సిగ్గుల్లో చిగురంత ఎరుపుందీ... వద్దుల్లో వరసైన వలపుందీ..
నాజూకు నడకల్లోనా... నలిగేటి మొలకల్లాగా...ఆవిరవ్వాలి అలిసీ..

ఆవిరులో... నా విరులే.. విర విరలాడాలీ..
కౌగిలింత ఇల్లుగా... కలిసి చేరగా !


రాగమో అనురాగమో.. గీతమో సంగీతమో
హ హ నా గుండెలో ఓ కోయిలా..ల ల ల ల..పూదండలో సన్నాయిలా
వలచీ పిలిచే..మత్తుగా కొత్తగా
లవ్ మీ..లవ్ మీ ...

లాలలా..లలాలలా..హేహెహే..లాలలలా..

No comments:

Post a Comment