Showing posts with label Naresh. Show all posts
Showing posts with label Naresh. Show all posts

Monday, June 12, 2023

కాలాల ఎనకాల ఒక ఎంకి

చిత్రం :  ఊహా సుందరి (1984)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి 
నేపథ్య గానం : బాలు


పల్లవి : 

కాలాల ఎనకాల ఒక ఎంకి ఉండేదట
ఆ ఎంకి నండూరి పాటల్లో మిగిలిందట
అది ఏ జాణు తెలుగో... అది ఏ జాణపదమో
ఆ ఎంకి మనసులో ఎన్నెన్ని ఊసులో
కడకంట ఎన్నెన్ని బాసలో...  

కాలాల ఎనకాల ఒక ఎంకి ఉండేదట


చరణం 1 : 


ఆ ఎంకి ఒకనాడు నా వంక చూసింది
ఆ చూపుతో వేగు చుక్కేదో పొడిచింది
అది కలలాగ ఎదిగి... నా కన్నీట కరిగి
నా ఆశ ఆకాశమై... ఆగిపోయింది
నా ఎంకి తెల్లారి ఎన్నెలైపోయింది

ఎదలోని ఆ ఎంకి ఎదురైన వేళ
పదమేది పాడెది ఈ వేళ

కాలాల ఎనకాల ఒక ఎంకి ఉండేదట
ఆ ఎంకి నండూరి పాటల్లో మిగిలిందట


చరణం 2 : 


తెలుగింటిలో ప్రేమ దీపాలు పెట్టింది
ఎనుగారిపోయాక ఎదచూసుకోమంది
అది నా గుండెనమిలి... నా మనసంత నలిగి
తెలుగోళ్ళకొక పాటగా... ఎంకి మిగిలింది
పాడలేని నాకు పల్లవైపోయింది

ఎదలోని ఆ ఎంకి ఎదురైన వేళ
పదమేది పాడెది ఈ వేళ


కాలాల ఎనకాల ఒక ఎంకి ఉండేదట
ఆ ఎంకి నండూరి పాటల్లో మిగిలిందట
అది ఏ జాణు తెలుగో... అది ఏ జాణపదమో
ఆ ఎంకి మనసులో ఎన్నెన్ని ఊసులో
కడకంట ఎన్నెన్ని బాసలో... 

కాలాల ఎనకాల ఒక ఎంకి ఉండేదట

Monday, May 30, 2022

జళ్ళో సంపంగి పువ్వు

చిత్రం :  ఊహా సుందరి (1984)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి 

నేపథ్య గానం : బాలు, సుశీల 



పల్లవి : 


జళ్ళో సంపంగి పువ్వు ఒళ్ళో సందేళ నువ్వు

జళ్ళో సంపంగి పువ్వు ఒళ్ళో సందేళ నువ్వు

సాయంత్రాల చలి మంత్రాలు చదివెయ్యాలి సందిట్లో

చెలి అందాల  తొలిలంచాలు అడిగెయ్యాలి సందట్లో  


జళ్ళో సంపంగి పువ్వు ఒళ్ళో సందేళ నువ్వు

జళ్ళో సంపంగి పువ్వు ఒళ్ళో సందేళ నువ్వు

పరికీణీల కుచ్చిలన్నీ పరిచెయ్యాలి పందిట్లో

అరవోణీల చిరుబోణీలు అందించాలి ఎన్నెట్లో 



చరణం 1 : 


సిగ్గనడం బుగ్గలవంతు... ముద్దనడం పెదవుల వంతు

ముద్దులతో బుగ్గల పెళ్ళికి... ముహూర్తాలు ఇప్పటి తంతు

ఆకాశం దాటుతున్నవి ఆశలిప్పుడు... ఉరుములుగా మోగుతున్నవి ఊహలిప్పుడు

గుండెల్లోని గుసగుసలన్నీ దాచెయ్యాలి గుప్పెట్లో


జళ్ళో సంపంగి పువ్వు ఒళ్ళో సందేళ నువ్వు

జళ్ళో సంపంగి పువ్వు ఒళ్ళో సందేళ నువ్వు

పరికీణీల కుచ్చిలన్నీ పరిచెయ్యాలి పందిట్లో

అరవోణీల చిరుబోణీలు అందించాలి ఎన్నెట్లో 


చరణం 2 : 


కోరికలే కోమలి వంతు... వేడుకలే వెన్నెల వంతు

కాటుకలే కన్నుల వంతు... అందించడమే కన్నెల వంతు

సావాసం ముదురుతున్నది సందెలప్పుడు

సంసారం కోరుతున్నది సరసమెప్పుడు

ముచ్చట్లన్నీ తీరేదాక మురిపాలన్నీ నిదట్లో


జళ్ళో సంపంగి పువ్వు ఒళ్ళో సందేళ నువ్వు

జళ్ళో సంపంగి పువ్వు ఒళ్ళో సందేళ నువ్వు

పరికీణీల కుచ్చిలన్నీ పరిచెయ్యాలి పందిట్లో

అరవోణీల చిరుబోణీలు అందించాలి ఎన్నెట్లో 


జళ్ళో సంపంగి పువ్వు ఒళ్ళో సందేళ నువ్వు

జళ్ళో సంపంగి పువ్వు ఒళ్ళో సందేళ నువ్వు

సాయంత్రాల చలి మంత్రాలు చదివెయ్యాలి సందిట్లో

చెలి అందాల  తొలిలంచాలు అడిగెయ్యాలి సందట్లో 

Sunday, May 29, 2022

ఊహా సుందరీ... ఊహా సుందరీ

చిత్రం :  ఊహా సుందరి (1984)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి 

నేపథ్య గానం : బాలు 



పల్లవి : 


ఊహా సుందరీ... ఊహా సుందరీ

ఊహా సుందరీ... ఊహా సుందరీ

కలవో తీపికలవో.. రేపినావే అల్లరి

ఊహా సుందరీ... ఊహా సుందరీ


చరణం 1 : 


నీలో ఉన్న యవ్వనాలు నవ్వుతుంటే... 

నాలో ముద్దమందారాల జల్లు కురిసే...

నీలో ఉన్న శృంగారాలు ఝల్లుమంటే...

నాలో ఉన్న కౌగిల్లెన్నో కళ్ళుతెరచే...

ఒకసారి కలిగించు ఆ దర్శనాలు...

ఆదర్శ సౌందర్య సందర్శనాలు...

కన్నెపాప... నా కన్నుపాప

నిను కలవరించెనే ప్రతిరాత్రి


ఊహా సుందరీ... ఊహా సుందరీ



చరణం 2 : 


నిన్ను చూసి చూడనట్టు నేనుంటే...

రెప్పలున్న కంటికేమో తిప్పలాయే...

అంటీ అంటనట్టు నిన్ను అంటుకుంటే...

చీకటంతా తెల్లబోయి వెన్నెలాయే...

నీ అందమే నాకు అరుణోదయాలు...

నా దేవి నిదురించు దేవాలయాలు...

జాజి రావే... సన్నజాజి రావే

నా కలత తీర్చవే ఒకసారి


ఊహా సుందరీ... ఊహా సుందరీ

కలవో తీపికలవో... రేపినావే అల్లరి


ఊహా సుందరీ... ఊహా సుందరీ

లాలాలాలలా... లాలాలాలలా

Saturday, August 3, 2013

రాగమో అనురాగమో

చిత్రం: నాలుగు స్తంభాలాట (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
గీతరచయిత: వేటూరి
నేపథ్య గానం: బాలు, జానకి


పల్లవి:

హే..హే..హే..హే..హే..హే..
లలలల..హే..హే..
రాగమో అనురాగమో..గీతమో సంగీతమో...
నా గుండెలో ఓ కోయిలా..పూదండలో సన్నాయిలా
వలచీ పిలిచే... మత్తుగా కొత్తగా
లవ్ మీ... లవ్ మీ!

రాగమో అనురాగమో..గీతమో సంగీతమో..
నా గుండెలో ఓ కోయిలా.. పూదండలో సన్నాయిలా..


చరణం 1:


సూరీడు చల్లారు నీ చూపూ... చలిగాలిలా వీచే నా వైపూ..
పరుగెత్తే పరువంలోనా... పడగెత్తే ప్రణయంలాగ... సాగిపోవాలి జతగా...

నీ కంటిలో ఉన్న చలిమంటా... తొలిగంట కొట్టింది నా కంట
పయనించే జవనంలోనా... పలికే ఋతుపవనం లాగా... జల్లు రావాలి వడిగా 

ఈ వడిలో... ఉరవడిలో... ముడివడి పోవాలీ..
కాలమెంత దూరమో కలిసి చూడగా 


రాగమో అనురాగమో..గీతమో సంగీతమో..
నా గుండెలో ఓ కోయిలా..పూదండలో సన్నాయిలా..


చరణం 2:


సందెల్లో మందార బొట్టుందీ... అందాల ముద్దిచ్చి అంటింది..
సెలయేటి అలజడిలోనా... చెలరేగే అల్లరిలాగా..ఊగిపోవాలి కలిసీ...

సిగ్గుల్లో చిగురంత ఎరుపుందీ... వద్దుల్లో వరసైన వలపుందీ..
నాజూకు నడకల్లోనా... నలిగేటి మొలకల్లాగా...ఆవిరవ్వాలి అలిసీ..

ఆవిరులో... నా విరులే.. విర విరలాడాలీ..
కౌగిలింత ఇల్లుగా... కలిసి చేరగా !


రాగమో అనురాగమో.. గీతమో సంగీతమో
హ హ నా గుండెలో ఓ కోయిలా..ల ల ల ల..పూదండలో సన్నాయిలా
వలచీ పిలిచే..మత్తుగా కొత్తగా
లవ్ మీ..లవ్ మీ ...

లాలలా..లలాలలా..హేహెహే..లాలలలా..