Friday, September 27, 2013

గుండెల్లో దడదడ దడ

చిత్రం: అంతం (1992) 
సంగీతం: ఆర్.డి. బర్మన్ 
గీతరచయిత: సిరివెన్నెల 
నేపధ్య గానం: బాలు, చిత్ర 

పల్లవి: 

గుండెల్లో దడదడ దడ లాడే ఉరుములతో 
కళ్ళల్లో భగ భగ భగ మండే మెరుపులతో 
ల ల ల లా ల లా 

ఊహల్ని ఉప్పొంగించే ఒత్తిడి చిత్తడి 
మబ్బుల్ని మత్తెకించే సుడిగాలి 
కొండల్ని ఢీకొట్టించే అల్లరి ఆవిరి 
దిక్కుల్ని దిమ్మెక్కించే తొలకరి 

గుండెల్లో దడదడదడ లాడే ఉరుములతో 
కళ్ళల్లో భగభగ భగ మండే మెరుపులతో 

చరణం 1: 

వెన్నెలంటే... వెండి మంటే...
వెన్నెలంటే వెండి మంటే... నిజమిదీ నమ్మవూ 
కన్నులుంటే నన్ను కంటే... రుజువులే కోరవూ 

ఆ..ఆ..ఆ..ఆ 

చీకట్లో జ్వలించిన చుక్కలా చేరునా 
ఏకాకి ఏకాంతంలో కలిసేలా 

గుండెల్లో దడదడదడ లాడే ఉరుములతో 
కళ్ళల్లో భగభగ భగ మండే మెరుపులతో 

చరణం 2: 

నిప్పు చెండై... చుట్టుకుంటే... 
నిప్పు చెండై చుట్టుకుంటే... కరగడా సూర్యుడు 
మంచు మంటై ముట్టుకుంటే... మరగడా చంద్రుడు 

ఆ..ఆ..ఆ..ఆ 

గంగమ్మ ఆయువునే తాగినా తగ్గునా 
సంద్రాన్ని ఆటాడించే చేడు దాహం

గుండెల్లో దడదడదడ లాడే ఉరుములతో 
కళ్ళల్లో భగభగ భగ మండే మెరుపులతో 

No comments:

Post a Comment