Wednesday, October 30, 2013

పగలే వెన్నెలా

చిత్రం : పూజాఫలం (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : జానకి


పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ....... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పగలే వెన్నెలా జగమే ఊయల
కదలె వూహలకే కన్నులుంటే...
ఏ..ఏ..ఏ.... ఏ..ఏ..ఏ.
పగలే వెన్నెలా జగమే ఊయల

చరణం 1:

నింగిలోన చందమామ తోంగి చూచే...
 నీటిలోన కలువభామ పోంగి పూచే.....ఏ..ఏ..ఏ.
 యీ అనురాగమే జీవనరాగమై...
యీ అనురాగమే జీవనరాగమై...
యెదలొ తేనేజల్లు కురిసిపోదా...ఆ ఆ ఆ ఆ

పగలే వెన్నెలా జగమే ఊయల


చరణం 2:

కడలి పిలువ కన్నేవాగు పరుగుతీసే...
మురళిపాట విన్ననాగు శిరసునూపే.....
యీ అనుబంధమే మధురానందమై
యీ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపిపోదా... ఆ ఆ ఆ ఆ

పగలే వెన్నెలా జగమే ఊయల

చరణం 3:

నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే...
పూలరుతువు సైగ చూచి పికము పాడే....
నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే...
పూలరుతువు సైగ చూచి పికము పాడే
మనసే వీణగా ఝు ఝున మ్రోయగా

బ్రతుకే పున్నమిగా విరిసిపోదా.. ఆ ఆ ఆ ఆ

పగలే వెన్నెలా జగమే ఊయల
కదలె వూహలకే కన్నులుంటే
ఏ..ఏ..ఏ.... ఏ..ఏ..ఏ.
పగలే వెన్నెలా....

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1061


No comments:

Post a Comment