చిత్రం : భువనేశ్వరి (1979)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు, జానకి
పల్లవి :
ఏమని పిలవాలి.. ఆహా.. హా.. హా.. హా..
నిన్నేమని పిలవాలి... ఆహా.. హా.. హా.. హా..
నవ మల్లికవో... కవి గీతికవో
నను వలచే ప్రియ రాధికవో...
ఏమని పిలవాని... ఆ.. ఆ..
చరణం : 1
నీ చిరునవ్వులు సోకిన చాలు.. సూర్యుడు వెన్నెల కాయునులే
నీ నును పైటను తాకిన చాలు.. గాలికి గిలిగింత కలుగునులే
నీ పాదాలు మోపిన చాలు.. శిలలైనా విరబూయునే....
ఏమని పిలవాలి.. ఆహా.. హా.. హా.. హా..
నిన్నేమని పిలవాలి... ఆహా.. హా.. హా.. హా..
నవ మల్లికవో... కవి గీతికవో
నను వలచే ప్రియ రాధికవో...
ఏమని పిలవాని... ఆ.. ఆ..
చరణం : 2
నీ కనుపాపల నీలిమలోనా ఆకాశాలే దాగెనులే .. అహా.. హా.. హా..
నీ మెయ్ వంపుల నిగ్గులలోన తొలకరి మెరుపులే తూగెనులే... ఆ.. హా.. హా...
నీ జతలోనా.. నీ శ్రుతిలోనా... మన బ్రతుకే పయనించాలిలే...
ఏమని పిలవాలి.. ఆహా.. హా.. హా.. హా..
నిన్నేమని పిలవాలి... ఆహా.. హా.. హా.. హా..
నవ మల్లికవో... కవి గీతికవో
నను వలచే ప్రియ రాధికవో...
ఏమని పిలవాలి... ఆ.. ఆ..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4826
No comments:
Post a Comment