Wednesday, October 30, 2013

సుందర సురనందన



చిత్రం : పూజాఫలం (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల


పల్లవి:

సుందర సురనందన వన మల్లి.... జాబిల్లి..

అందేనా ఈ చేతుల కందేనా...ఆ..
అందేనా ఈ చేతుల కందేనా..ఆ..ఆ..
చందమామ ఈ కనులకు విందేనా...ఆ..ఆ..
అందేనా ఈ చేతుల కందేనా...

చరణం 1:

ఆ మడుగున కనిపించి...నా మనసున నివశించి
అంతలోనే ఆకాశపు అంచుల విహరించె...ఏ...
చందమామ ఈ కనులకు విందేనా ..ఆ..ఆ..ఆ..

చరణం 2:

తలపు దాటనీక మనసు తలుపు వేయగలను గాని....
నింగి పైకి ఆశలనే నిచ్చెనేయగలను గాని...
కొలనులోన కోర్కెలనే అలలపైన ఊగే...
కలువ పేద బ్రతుకులోన వలపు తేనె నింపేనా ....ఆ..ఆ..ఆ..
చందమామ ఈ కనులకు విందేనా....ఆ..ఆ..ఆ



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1624

1 comment:

  1. on which raga this song is composed by? Please let me know

    ReplyDelete