Tuesday, November 26, 2013

ప్రియమైన మదన

చిత్రం : గందర గోళం (1980)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల 

పల్లవి : 

ప్రియమైన మదన... ఎదలో.. ఎప్పుడో.. నెలకొన్న రాజా
నమస్తే... క్షేమమా.. సౌఖ్యమా.. అంటోంది నా ప్రేమలేఖా..

ప్రియమైన మదన... ఎదలో.. ఎప్పుడో.. నెలకొన్న రాజా
నమస్తే... క్షేమమా.. సౌఖ్యమా.. అంటోంది నా ప్రేమలేఖా..

చరణం : 1

నాలోని శతకోటి భావాలలో...  ఏ ఊహ రాయాలి మునుముందుగా
నాలోని శతకోటి భావాలలో...  ఏ ఊహ రాయాలి మునుముందుగా
అనురాగమౌతోంది అభిశారిక.. ఏనాడు తీరేను ఈ కోరిక
ఎన్నడో దరిశనం.. అంటోంది నా ప్రేమలేఖా... 

ప్రియమైన మదన... ఎదలో.. ఎప్పుడో...  నెలకొన్న రాజా
నమస్తే... క్షేమమా.. సౌఖ్యమా.. అంటోంది నా ప్రేమలేఖా..

చరణం : 2

మందారమకరంద మాధుర్యమే...  ఉందేమో అందాల నీ పేరులో
మందారమకరంద మాధుర్యమే... ఉందేమో అందాల నీ పేరులో
మరుమల్లే జాబిల్లి మలయానిలం... మధుకీలగా పెంచే నా వేదన
ఆగదా... విరహమో... అంటోంది నా ప్రేమలేఖ..

ప్రియమైన మదన... ఎదలో.. ఎప్పుడో నెలకొన్న రాజా
నమస్తే... క్షేమమా.. సౌఖ్యమా.. అంటోంది నా ప్రేమలేఖా..
అహాహా.. అంటోంది నా ప్రేమలేఖా... 

చిలికి చిలికి చిలిపి వయసు

చిత్రం : ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : రామకృష్ణ, సుశీల


పల్లవి:

చిలికి చిలికి చిలిపి వయసు.. వలపు వాన అవుతుంది
వలచి వలచి చెలియ మనసు... పూల పల్లకి అవుతుంది..ఈ..
పూల పల్లకి అవుతుంది..

హే.. ఓహో.. అహహా.. హా.. అ..
ఆహా.. హా.. ఆ.. ఒహోహో.. ఓ..

చిలికి చిలికి చిలిపి వయసు.. వలపు వాన అవుతుంది
వలచి వలచి చెలియ మనసు.. పూల పల్లకి అవుతుంది..ఈ..
పూల పల్లకి అవుతుంది..

చరణం 1:

పొంగే కెరటం.. తీరం కోసం.. పరుగులు తీస్తుంది..ఈ..
పూచే కుసుమం.. తుమ్మెద కోసం.. దారులు కాస్తుంది
పొంగే కెరటం తీరం కోసం.. పరుగులు తీస్తుంది..ఈ..
పూచే కుసుమం.. తుమ్మెద కోసం.. దారులు కాస్తుంది

అందమంతా.. జంట కోసం...
అందమంతా జంట కోసం.. ఆరాట పడుతుంది..ఈ..
ఆరాట పడుతుంది

చిలికి చిలికి చిలిపి వయసు.. వలపు వాన అవుతుంది
వలచి వలచి చెలియ మనసు.. పూల పల్లకి అవుతుంది..ఈ..
పూల పల్లకి అవుతుంది..

చరణం 2:

తుంటరి పెదవి.. జంటను కోరి.. తొందర చేస్తుంది..ఈ..
దాచిన తేనెలు దోచే దాక.. ఓపనంటుంది
తుంటరి పెదవి.. జంటను కోరి.. తొందర చేస్తుంది..ఈ..
దాచిన తేనెలు దోచే దాక.. ఓపనంటుంది

రోజు రోజు.. కొత్త మోజు..
రోజు రోజు.. కొత్త మోజు.. రుచులేవో ఇస్తుంది..ఈ..
రుచులేవో ఇస్తుంది..

చిలికి చిలికి చిలిపి వయసు.. వలపు వాన అవుతుంది..ఈ..
వలచి వలచి చెలియ మనసు.. పూల పల్లకి అవుతుంది..ఈ..
పూల పల్లకి ఔతుంది..

హే.. ఏహే.. ఒహోహో.. ఓ..
ఆ.. ఆహహా.. హాహహా.. ఆహహా.. హాహహా..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1755



Monday, November 25, 2013

ఎవరు నీవు నీ రూపమేది



చిత్రం :  ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)
సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి:

ఎవరు నీవు నీ రూపమేది ..
ఏమని పిలిచేదీ.. నిన్నేమని పిలిచేదీ
ఎవరు నీవు నీ రూపమేది ..
ఏమని పిలిచేదీ.. నిన్నేమని పిలిచేదీ

నేనని వేరే లేనేలేనని...
నేనని వేరే లేనేలేనని ఎలా తెలిపేదీ
మీకెలా తెలిపేదీ..

చరణం 1:

నిదుర పోయిన మనసును లేపి.. మనిషిని చేసిన మమతవు నీవో
నిదుర పోయిన మనసును లేపి.. మనిషిని చేసిన మమతవు నీవో
నిదురేరాని కనులను కమ్మని.. కలలతో నింపిన కరుణవు నీవో

పూజకు తెచ్చిన పూవును నేను ఊ... ఊ... ఊ...
పూజకు తెచ్చిన పూవును నేను.. సేవకు వచ్చిన చెలిమిని నేను
వసివాడే ఆ పసిపాపలకై..
వసివాడే ఆ పసిపాపలకై.. దేవుడు పంపిన దాసిని నేను

నేనని వేరే లేనేలేనని ఎలా తెలిపేదీ.. మీకెలా తెలిపేదీ..
ఎవరు నీవు నీ రూపమేది ..
ఏమని పిలిచేదీ.. నిన్నేమని పిలిచేదీ

చరణం 2:

చేదుగ మారిన జీవితమందున.. తీపిన చూపిన తేనెవు నీవు..
చేదుగ మారిన జీవితమందున.. తీపిన చూపిన తేనెవు నీవు

వడగాడ్పులలో వడలిన తీగకు..చిగురులు తొడిగిన చినుకే మీరు
చిగురులు తొడిగిన చినుకే మీరు...

కోరిక లేక కోవెలలోన.. వెలుగై కరిగే దీపం నీవు
దీపంలోని తాపం తెలిసి..
దీపంలోని తాపం తెలిసి.. ధన్యను చేసే దైవం మీరు
దైవం మీరు..
అహా హా అహా హా.. ఓహోహో ఓహోహో..
ఊహూహూ ఊహూహూ..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1702

మనసు గతి ఇంతే

చిత్రం :  ప్రేమనగర్ (1971)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల

పల్లవి:

తాగితే మరచిపోగలను... తాగనివ్వదు
మర్చిపోతే తాగగలను... మరువనివ్వదు

మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే

మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసు గతి ఇంతే ...

చరణం 1:

ఒకరికిస్తే మరలి రాదూ ..ఓడిపోతే మరిచిపోదూ
ఒకరికిస్తే మరలి రాదూ ..ఓదిడిపోతే మరిచిపోదూ
గాయమైతే మాసిపోదూ ... పగిలిపోతే అతుకుపడదూ

మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే..మనసు గతి ఇంతే 

చరణం 2:

అంతా మట్టేనని తెలుసూ... అదీ ఒక మాయేనని తెలుసూ
అంతా మట్టేనని తెలుసూ ... అదీ ఒక మాయేనని తెలుసూ
తెలిసీ వలచీ విలపించుటలో ... తీయదనం ఎవరికి తెలుసూ 

మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే...మనసు గతి ఇంతే

చరణం 3:

మరుజన్మ ఉన్నదో లేదో ...ఈ మమతలప్పుడేమౌతాయో
మరుజన్మ ఉన్నదో లేదో ... ఈ మమతలప్పుడేమౌతాయో
మనిషికి మనసే తీరని శిక్షా... దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా

మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే..
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసు గతి ఇంతే

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1175

నేను పుట్టాను లోకం మెచ్చింది




చిత్రం  :  ప్రేమనగర్ (1971)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల

పల్లవి:

నేను పుట్టాను... లోకం మెచ్చింది
నేను ఏడ్చాను... లోకం నవ్వింది
నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది.. డోంట్ కేర్.. 

నేను పుట్టాను... లోకం మెచ్చింది
నేను ఏడ్చాను... లోకం నవ్వింది
నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది.. డోంట్ కేర్.. 

చరణం 1:

నేను తాగితే కొందరి కళ్లు గిరగిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్లు వంతలు పాడాయి
నేను తాగితే కొందరి కళ్లు గిరగిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్లు వంతలు పాడాయి

నేను ఆడితే అందరి కాళ్లు నాతో కలిశాయి 
నేను ఆడితే అందరి కాళ్లు నాతో కలిశాయి
తెల్లవారితే వెనక చేరి నవ్వుకుంటాయి..
హ హ హ హ హ... డోంట్ కేర్...

నేను పుట్టాను... లోకం మెచ్చింది
నేను ఏడ్చాను... లోకం నవ్వింది
నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది.. 

చరణం 2:

మనసులు దాచేటందుకు పైపై నవ్వులు ఉన్నాయి
మనిషికి లేని అందం కోసం రంగులు ఉన్నాయి
ఎరగక నమ్మినవాళ్ల నెత్తికి చేతులు వస్తాయి
ఎరగక నమ్మినవాళ్ల నెత్తికి చేతులు వస్తాయి
ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి..
డోంట్ కేర్....

నేను పుట్టాను... లోకం మెచ్చింది
నేను ఏడ్చాను... లోకం నవ్వింది
నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది..  

చరణం 3:

మనిషిని మనిషిని కలిపేటందుకే పెదవులు ఉన్నాయి
పెదవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి
బాధలన్ని బాటిల్లో నేడే దింపేసేయ్
బాధలన్ని బాటిల్లో నేడే దింపేసేయ్
అగ్గిపుల్ల గీసేసెయ్ నీలో సైతాన్ తరిమేసేయ్..
డ్రైవ్ ది డెవిల్ అవుట్..హ హ హ హ హ హ... 

నేను పుట్టాను... లోకం మెచ్చింది
నేను ఏడ్చాను... లోకం నవ్వింది
నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది..  డోంట్ కేర్....


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1171


తేట తేట తెలుగులా



చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల



పల్లవి:

తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా
తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా
కదలి వచ్చింది.. కన్నె అప్సరా
వచ్చి నిలిచింది.. కనుల ముందరా..

తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా
తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా
కదలి వచ్చింది.. కన్నె అప్సరా
వచ్చి నిలిచింది.. కనుల ముందరా..

చరణం 1:

తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా

గోదారి కెరటాల గీతాల వలే నాలో
పలికినది..... పలికినది.... పలికినది

చల్లగా చిరుజల్లుగా... జల జల గల గలా
కడలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలిచింది కనుల ముందరా

తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా...

చరణం 2:

రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి

లోలోన.. నాలోన.. ఎన్నెన్నో రూపాలు
వెలసినవి..... వెలసినవి... వెలసినవి...
వీణలా.. నెరజాణలా... కల కల.. గల గలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
ఎదుట నిలిచింది కనుల ముందరా

తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1174

కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల



చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి:

కడవెత్తుకొచ్చిందీ... ఈ ఈ ఈ... కన్నెపిల్ల.. ఆ ఆ..
అది కనపడితే చాలు నా గుండె గుల్ల
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
అది కనపడితే చాలు నా గుండె గుల్ల

కాడెత్తుకొచ్చాడూ...ఊ ఊ ఊ... గడుసుపిల్లడు.. ఊ ఊ..
వాడు కనపడితే చాలు నాకొళ్ళు తెలవదు
కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు

చరణం 1:

పిక్కలపై దాక.. చుక్కల చీర కట్టి
పిక్కల పై దాక.. చుక్కల చీర కట్టి
పిడికలంత నడుము చుట్టు పైట కొంగు బిగగట్టి
వెళుతుంటే...చూడాలి..
వెళుతుంటే చూడాలి దాని నడక
అబ్బో ఎర్రెత్తి పోవాలి దాని ఎనక

కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
అది కనపడితే చాలు నా గుండె గుల్ల

చరణం 2:

చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగారాలు
చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు
బిరుసైన..కండరాలు..
బిరుసైనా కండరాలు.. మెరిసేటి కళ్ళడాలు
వస్తుంటే.. చూడాలి
వస్తుంటే చూడాలి వాడి సోకు
వాడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు

కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు

చరణం 3:

తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి
అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు
తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి
అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు

దున్నుతుంటే ...చూడాలి
దున్నుతుంటే చూడాలి వాడి జోరు
వాడు తోడుంటే తీరుతుంది వయసుపోరు

కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు

చరణం 4:

నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు
వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది
నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు
వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది

చూస్తుంటే చాలు దాని సోకు మాడ
పడి చస్తాను వస్తనంటే కాళ్ళకాడ

కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
అది కనపడితే చాలు నా గుండె గుల్ల
కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1680

ఎవరో రావాలి



చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

ఆ... ఆ... ఆ... ఆ...

ఎవరో రావాలి..
నీ హృదయం.. కదిలించాలి
నీ తీగలు.. సవరించాలి
నీలో రాగం.. పలికించాలి

ఎవరో రావాలి....
నీ హృదయం.. కదిలించాలి
నీ తీగలు.. సవరించాలి
నీలో రాగం.. పలికించాలి..
ఎవరో రావాలి....

చరణం 1:

మూల దాగి ధూళి మూగి... మూగవోయిన మధుర వీణ..
మూల దాగి ధూళి మూగి... మూగవోయిన మధుర వీణ..
మరిచి పోయిన మమత లాగ...
మరిచి పోయిన మమత లాగ... మమతలుడిగిన మనసు లాగ
మాసిపో.. తగునా...
ఎవరో రావాలి....

చరణం 2:

ఎన్ని పదములు నేర్చినావో... ఎన్ని కళలను దాచినావో..
ఎన్ని పదములు నేర్చినావో... ఎన్ని కళలను దాచినావో..
కొనగోట మీటిన చాలు...
కొనగోట మీటిన చాలు... నీలో కోటి స్వరములు పలుకును..

ఎవరో రావాలి.....

చరణం 3:

రాచనగరున వెలసినావు... రస పిపాసకు నోచినావు
రాచనగరున వెలసినావు... రస పిపాసకు నోచినావు
శక్తి మరచి.. రక్తి విడచి...
శక్తి మరచి.. రక్తి విడచి... మత్తు ఏదో మరగినావు
మరిచిపో... తగునా...

ఎవరో రావాలి....
నీ హృదయం.. కదిలించాలి
నీ తీగలు.. సవరించాలి
నీలో రాగం.. పలికించాలి..
ఎవరో రావాలి.... 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1173

ఎవరికోసం



చిత్రం :  ప్రేమనగర్ (1971)
సంగీతం  :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం  :  ఘంటసాల

పల్లవి:

ఎవరికోసం ..ఎవరికోసం
ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం
ఈ భగ్న హృదయం ..ఈ అగ్ని గుండం
ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం 

చరణం 1:

ప్రేమభిక్ష నువ్వే పెట్టీ
ఈ పేద హృదయం పగులగొట్టీ
పిచ్చివాణ్ణి పాత్రలేని బిచ్చగాణ్ణి చేశావు
నువ్వివనిదీ తాకలేనూ ..ఇంకెవరినీ అడుగలేనూ
బ్రతుకు నీకు ఇచ్చాను.. చితిని నాకు పేర్చావు

ఎవరికోసం ..ఎవరికోసం
ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం
ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం ??

చరణం 2:

ఓర్వలేని ఈ ప్రకృతి ప్రయళంగా మారనీ
నా దేవి లేని ఈ కోవెల తునాతునకలై పోనీ
కూలిపోయి ధూళిలో కలసిపోనీ ...కాలిపోయి బూడిదే మిగలనీ

ఎవరికోసం ..ఎవరికోసం
ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం
ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం 

చరణం 3:

మమత నింపమన్నానూ .. మనసు చంపుకొన్నావూ
మధువు తాగనన్నాను .. విషం తాగమన్నావూ
నీకు ప్రేమంటే నిజం కాదూ ...నాకు చావంటే భయంలేదూ
నీ విరహంలో బ్రతికానూ ...ఈ విషంతో మరణిస్తానూ ...మరణిస్తానూ..  

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1192

Monday, November 18, 2013

ప్రియతమా నా హృదయమా

చిత్రం : ప్రేమ (1989)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు


పల్లవి:

ప్రియతమా నా హృదయమా ... ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా... ప్రేమకే ప్రతి రూపమా
నా గుండెలో నిండినా గానమా... నను మనిషిగా చేసినా త్యాగమా
ప్రియతమా నా హృదయమా... ప్రేమకే ప్రతి రూపమా

చరణం 1:

శిలలాంటి నాకు జీవాన్ని పోసి ... కలలాంటి బ్రతుకు కళ తోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి... యదలోని సెగలు అడుగం మాపి
తులి వెచ్చనైనా ఓదార్పు నీవై ...శృతిలయ లాగా జత చేరినావు
నువ్వు లేని నన్ను ఊహించలేను ... నా వేదనంతా నివేదించలేను
అమరం... అఖిలం... మన ప్రేమా
ప్రియతమా నా హృదయమా...  ప్రేమకే ప్రతి రూపమా

చరణం 2:

నీ పెదవి పైనా వెలుగారనీకు... నీ కనులలోనా తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు...  అది వెల్లువల్లె నను ముంచనీకు
ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా...  మహాసాగరాలే నిను మింగుతున్నా
ఈ జన్మలోనా ఎడబాటు లేదు... పది జన్మలైనా ముడే వీడిపోదు
అమరం ... అఖిలం... మన ప్రేమా

ప్రియతమా నా హృదయమా....  ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతి రూపమా .... ప్రేమకే ప్రతి రూపమా
నా గుండెలో నిండినా గానమా.... నను మనిషిగా చేసినా త్యాగమా
ప్రియతమా నా హృదయమా ... ప్రేమకే ప్రతి రూపమా
ప్రియతమా నా హృదయమా ... ప్రేమకే ప్రతి రూపమా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11013

ఈనాడే ఏదో అయ్యిందీ

చిత్రం : ప్రేమ (1989)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర

పల్లవి:

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఈనాడే ఏదో అయ్యిందీ...ఏనాడూ నాలో జరగందీ
ఈ అనుభవం మరలా రానిదీ... ఆనంద రాగం మోగిందీ
అందాలా లోకం రమ్మందీ...

ఈనాడే ఏదో అయ్యిందీ... నాలో జరగందీ

చరణం 1:

నింగీ నేలా ఏకం కాగా...  ఈ క్షణమిలాగె ఆగిందీ
నింగీ నేలా ఏకం కాగా...  ఈ క్షణమిలాగె ఆగిందీ

ఒకటే మాటన్నదీ... ఒకటై పొమ్మన్నదీ
మనసే ఇమ్మన్నదీ...  అదినా సొమ్మన్నదీ

పరువాలు మీటి... న న న న న
సెలయేటీ తోటి... న న న న న
పాడాలీ నేడు... న న న న న
కావాలీ తోడు... న న న న న న న న ....
ఈనాడే ఏదో అయ్యిందీ ... ఏనాడూ నాలో జరగందీ

చరణం 2:

సూర్యుని మాపీ చంద్రుని ఆపీ.. వెన్నెల రోజంత కాసిందీ
సూర్యుని మాపీ చంద్రుని ఆపీ.. వెన్నెల రోజంత కాసిందీ

పగలూ రేయన్నదీ.... అసలే లేదన్నదీ
కలలే వద్దన్నదీ.... నిజమే కమ్మన్నదీ

ఎదలోనీ ఆశ... న న న న న
ఎదగాలి బాసై... న న న న న
కలవాలీ నీవు... న న న న న
కరగాలీ నేను... న న న న న న న న ....

ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ
ఈ అనుభవం మరలా రానిదీ
ఆనందరాగం మోగిందీ... అందాలా లోకం రమ్మందీ
ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11012

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు

చిత్రం : ప్రేమ (1989)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర


పల్లవి:

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు

వద్దు వద్దు అంటూ పోతే... చిన్నదానా ఎప్పుడంట ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా ..పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే .... 

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు

చరణం 1:

ఆద్యంతమూ లేని .. అమరానందమే ప్రేమ
ఏ బంధమూ లేని .. తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము .. ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము .. ప్రేమ జ్ఞానయోగము

మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్దులేవీ లేనిది అందమైన ప్రేమ..

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా.. ఎప్పుడంట ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా ..పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే ...

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు

ఇవ్వు ఇవ్వు.... ఆహాహాహా... 
ఒక్క ముద్దు... ఆహహాహా

చరణం 2:

ఓ అల్లరి ప్రేమ .. ఇక ఆడించకు నన్ను
ఓ టక్కరి ప్రేమ .. ఇక లాలించకు నన్ను
నీకు నేను సొంతము .. నాకు నీవు సర్వము
నీవు నాకు దేహము .. నేను నీకు ప్రాణము
ప్రతిరోజూ నీ ఉదయాన్ని నేను
ప్రతిరేయీ నీ నెలవంక నేను
జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే..

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా... ఎప్పుడంట ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా ..పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే ...

ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు... ఇవ్వలేంది అడగవద్దు
ఆ... ఇవ్వు ఇవ్వు... ఆహాహాహా... 
ఒక్క ముద్దు... ఆహహాహా







మెరుపులా మెరిశావు

చిత్రం : ప్రేమ సంకెళ్లు (1982)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

ఓహో... ఓ..
ఓహో... ఓ...

ఓహో... ఓ...

మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు...
కన్ను తెరిచి చూసేలోగా.... నిన్నలలో నిలిచావు...
నిన్నలలో నిలిచావు...

మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు...
కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు....
నిన్నలలో నిలిచావు...

చరణం 1:

మల్లెల కన్నీరు చూడు... మంచులా కురిసింది
లేత ఎండ నీడలలో... నీ నవ్వే కనిపించింది
వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో...
వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో ...
దోసిట నా ఆశలన్నీ... దోచి వెళ్ళిపొయావు ...

మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
కన్ను తెరిచి చూసేలోగా.... నిన్నలలో నిలిచావు...
నిన్నలలో నిలిచావు

చరణం 2:

ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి...
ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి...
ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి
ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి...

పసుపైనా కానీవా... పదాలంటుకొనీవా ....
పాదాలకు పారాణై... పరవశించిపోనీవా...
పలకరించిపోలేవా...

మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు...
నిన్నలలో నిలిచావు...

చరణం 3:

వేకువంటి చీకటి మీద... చందమామ జారింది...
నీవు లేని వేదనలోనే... నిశిరాతిరి నిట్టూర్చింది...
తెల్లారని రాతిరిలా... వేకువలో వెన్నెలలా...
తెల్లారని రాతిరిలా... వేకువలో వెన్నెలలా...
జ్ఞాపకాల వెల్లువలోనే... కరిగి చెరిగిపోతున్నాను


మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు...
నిన్నలలో నిలిచావు...

మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
కన్ను తెరిచి చూసేలోగా..
నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు ...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6003



స్వాతీ ముత్యపు జల్లులలో

చిత్రం : ప్రేమ యుద్ధం (1990)
సంగీతం : హంసలేఖ
గీతరచయిత : వనమాలి
నేపధ్య గానం : బాలు, జానకి


పల్లవి:

స్వాతీ ముత్యపు జల్లులలో..శ్రావణ మేఘపు జావళిలో..
స్వాతీ ముత్యపు జల్లులలో..శ్రావణ మేఘపు జావళిలో..
నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే...
నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే...
ఆ...ఆఆ...ఆఆ....ఆఆ అహా హా...ఓ ఓహోహొ...

స్వాతీ ముత్యపు జల్లులలో..శ్రావణ మేఘపు జావళిలో..
స్వాతీ ముత్యపు జల్లులలో..శ్రావణ మేఘపు జావళిలో..
నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే...
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే...
ఆ...ఆఆ...ఆఆ....ఆఆ అహా హా...ఓ ఓహోహొ...

చరణం 1:

దరువేసిందమ్మా.. కబురే కసిగా తెలిపీ.. తడిగా ఒడినే దులిపీ..
జడివానేం చేస్తుందీ జవరాలే తోడుంటే...

తడిపేసిందమ్మా.. తనువూ తనువూ కలిపీ.. తనతో సగమే చెరిపీ..
చలిగాలేం చేస్తుందీ చెలికాడే తోడుంటే....

ఆ మెరుపులకే మెలితిరిగే సొగసులతో...
ఈ ఉరుములకే ఉలికి పడే వయసులతో...
కురిసిందీ వానా తొలిగా పరువానా...


స్వాతీ ముత్యపు జల్లులలో..శ్రావణ మేఘపు జావళిలో..
నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే...
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే

చరణం 2:

లా ల్లలల్లా.....లా ల్లలల్లా.....
మతిపోయిందమ్మా...
మనసు మనసు కలిసి.. కథలు కళలు తెలిసీ...
జలపాతం నీవైతే... అల గీతం నేనే లే...
కసిరేగిందమ్మా...
 కలతో నిజమే కలిసీ ... దివిని భువినీ కలిపీ...
సిరి తారలు తెస్తాలే నీ విరులే చేస్తాలే...

ఈ చిటపటకే శృతి కలిపే వలపులతో....
ఈ తపనలకే జత కలిసే తలపులతో...
కురిసిందీ వానా... తొలిగా పరువానా..

స్వాతీ ముత్యపు జల్లులలో.. శ్రావణ మేఘపు జావళిలో..
స్వాతీ ముత్యపు జల్లులలో.. శ్రావణ మేఘపు జావళిలో..
నిండే దోసిలి... పండే కౌగిలి.. నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే...
ఆ...ఆఆ...ఆఆ....ఆఆ అహా హా...ఓ ఓహోహొ...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10765

తారక చెప్పదు ఏనాడు

చిత్రం : ప్రేమ మూర్తులు (1982)
సంగీతం : చక్రవర్తి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:
ల... ల... ల...

తారక చెప్పదు ఏనాడు... జాబిలి వెన్నెల వీడ్కోలు
తారక చెప్పదు ఏనాడు... జాబిలి వెన్నెల వీడ్కోలు
ఆకాశానికి ఆ రెండూ... దేవుడు పెట్టిన దీపాలు

తారక అడగదు ఏనాడు... పున్నమి వెన్నెల వీడ్కోలు
తారక అడగదు ఏనాడు... పున్నమి వెన్నెల వీడ్కోలు
అనురాగానికి ఆ రెండూ... మమతల హారతి కాబోలు

చరణం 1:

ఉదయకాంతి నీ పెదవుల మెరిసి... తాంబూలంగా చూస్తుంటా
నీలి మబ్బు నీ నీలాల కురులకే... చుక్క మల్లెలే అందిస్తా

చిరుగాలులు నీ తాకిడిగా... సెలయేరులు నీ అలికిడిగా
నాలో నిన్నే చూసుకుంటూ... కాలం ఇట్టే గడిపేస్తా

కాలమంతా కరిగిపోయే కౌగిలింతలు నేనిస్తా

 తారక అడగదు ఏనాడు... పున్నమి వెన్నెల వీడ్కోలు
  ఆకాశానికి ఆ రెండూ... దేవుడు పెట్టిన దీపాలు

చరణం 2:

వేడి ఆశనై వేసవి గాలుల... వెచ్చని కబురులు పంపిస్తా
కలల నీడలే కౌగిళ్లనుకొని... కలవరింతగా కలిసొస్తా

నెలవంకలు నీ నవ్వులుగా... కలహంసలు నీ నడకలుగా
కావ్యాలెన్నో రాసుకుంటూ... కవినే నీకై వినిపిస్తా

కవితలాగా నిలిచిపోయే అనుభవాలే పండిస్తా

తారక చెప్పదు ఏనాడు... జాబిలి వెన్నెల వీడ్కోలు
ఆకాశానికి ఆ రెండూ... దేవుడు పెట్టిన దీపాలు
తారక అడగదు ఏనాడు... పున్నమి వెన్నెల వీడ్కోలు
అనురాగానికి ఆ రెండూ... మమతల హారతి కాబోలు
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2757

Saturday, November 16, 2013

ప్రేమ మందిరం

చిత్రం :  ప్రేమ మందిరం (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

ప్రేమ మందిరం.. ఇదే ప్రేమ మందిరం
ప్రేమ మందిరం.. ఇదే ప్రేమ మందిరం..

నిరుపేదలు తల దాచుకునే నింగి కుటీరం
కలవారలు కలలు కనే పసిడి పంజరం
నిరుపేదలు తల దాచుకునే నింగి కుటీరం
కలవారలు కలలు కనే పసిడి పంజరం
ప్రేమ మందిరం... ఇదే ప్రేమ మందిరం ఊ...ఊ..ఊ..

చరణం 1:

ఎనిమిది దిక్కుల నడుమ సంసారం
ఎనభై నాలుగు లక్షల సంతానం
ఎనిమిది దిక్కుల నడుమ సంసారం
ఎనభై నాలుగు లక్షల సంతానం

సప్తస్వర సంగీతం... నవరసాల సాహిత్యం
రంగరించుకున్నదీ రంగుల వలయం

రిసరిగ గసగమ సగమదనిస
నిదపమగరిసనిద

సప్త స్వర సంగీతం.. నవరసాల సాహిత్యం
రంగరించుకున్నదీ రంగుల వలయం
మనసంఘమ నిలయం... నవసాగర మధనం...ఇది శాశ్వత ప్రణయం
సుందరం.. సుమధురం.. ప్రేమ మందిరం

నిరుపేదలు తలదాచుకొనే నింగి కుటీరం
కలవారలు కలలు కనే పసిడి పంజరం
ప్రేమ మందిరం... ఇదే ప్రేమ మందిరం

చరణం 2:

నీలో విన్నా వలపుల ఓంకారం
నీలో కన్నా వెలుగుల ఆకారం
నీలో విన్నా వలపుల ఓంకారం
నీలో కన్నా వెలుగుల ఆకారం

ఉదయారుణ మందారం... హృదయేశ్వరి సింధూరం
కౌగిలిగా మెరిసిన... కళ్యాణ మంటపం
రిసరిగ గరిదప దపదప దపదస
ఉదయారుణ మందారం... హృదయేశ్వరి సింధూరం
కౌగిలిగా మెరిసిన... కళ్యాణ మంటపం

ఇది సృష్టికి ప్రాణం.. మన ముక్తికి మూలం
ఇది ఇలలో స్వర్గం...
సుందరం... సుమధురం... ప్రేమ మందిరం

నిరుపేదలు తల దాచుకొనే నింగి కుటీరం
కలవారలు కలలు కనే పసిడి పంజరం
ప్రేమ మందిరం... ఇదే ప్రేమ మందిరం

చంద్రోదయం.. చంద్రోదయం

చిత్రం :  ప్రేమ మందిరం (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

చంద్రోదయం.. చంద్రోదయం

మబ్బులు విడివడి... మనసులు ముడిపడి
కన్నులు కలిసిన కార్తీకంలో...
కౌగిలి బిగిసిన ఏకాంతంలో...
చంద్రోదయం... చంద్రోదయం..

మబ్బులు విడివడి... మనసులు ముడిపడి
కన్నులు కలిసిన కార్తీకంలో...
కౌగిలి బిగిసిన ఏకాంతంలో...
చంద్రోదయం.. చంద్రోదయం

చరణం 1:

నీవు నేను కలిసే వేళ... నింగి నేల తానాలు
కలసి అలసి సొలసే వేళ... కడలి నదుల మేళాలు

పూచిన పున్నాగ పూల సన్నాయి
చూపులలో మూగ బాసలున్నాయి
పూచిన పున్నాగ పూల సన్నాయి
చూపులలో మూగ బాసలున్నాయి

ఇద్దరు అలజడి... ముద్దుల కలబడి
నిద్దర లేచిన పొద్దులలో...
పొద్దులు మరచిన పొందులలో...
చంద్రోదయం... చంద్రోదయం..

మబ్బులు విడివడి... మనసులు ముడిపడి
కన్నులు కలిసిన కార్తీకంలో...
కౌగిలి బిగిసిన ఏకాంతంలో...
చంద్రోదయం.. చంద్రోదయం

చరణం 2:

చెరిసగమై కౌగిలిలో... దిక్కులు కలిసిన తీరాలు...
కౌగిలిలో గల జాబిలితో... చుక్కలు చూడని నేరాలు...

కన్నుల కాటుక చిలిపి ఉత్తరాలు
పున్నమి వెన్నెల తగిలితే జ్వరాలు
కన్నుల కాటుక చిలిపి ఉత్తరాలు
పున్నమి వెన్నెల తగిలితే జ్వరాలు

తూరుపు త్వరపడి... పడమట స్థిరపడి
విర విరలాడిన విరి పానుపులలో...
విరులావిరులౌ నిట్టూర్పులలో...
చంద్రోదయం... చంద్రోదయం

మబ్బులు విడివడి... మనసులు ముడిపడి
కన్నులు కలిసిన కార్తీకంలో...
కౌగిలి బిగిసిన ఏకాంతంలో...
చంద్రోదయం... చంద్రోదయం
చంద్రోదయం... చంద్రోదయం

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1865

ఎక్కడో చూసినట్టు

చిత్రం : ప్రేమ మందిరం (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

ఎక్కడో.. ఓ ఓ ఓ......ఎప్పుడో.. ఓ ఓ ఓ...
ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు
ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు
బాలరాజువా.. దేవదాసువా.. బాటసారివా.. కాళిదాసువా

ఎప్పుడో.. ఓ ఓ ఓ... ఎక్కడో.. ఓ ఓ ఓ...
ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు
ఎక్కడో కలిసినట్టు ఉన్నాది నాకు
చంద్రలేఖవా.. శశిరేఖవా.. భద్రకాళివా.. చండీప్రియవా

చరణం 1:

మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ
చూసుకున్న చూపులన్ని అదో మాదిరి
మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ
చూసుకున్న చూపులన్ని అదో మాదిరి

ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి
అవి చెదరగానే కలత రాతిరి
ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి
అవి చెదరగానే కలత రాతిరి
కలల రాతిరీ.. కథల రాతిరి.. ప్రేమ కథల రాతిరి
కలత రాతిరీ.. బరువు రాతిరి.. గుండె బరువు రాతిరి

ఎప్పుడో.. ఓ ఓ ఓ... ఎక్కడో.. ఓ ఓ ఓ...
ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు
ఎక్కడో కలిసినట్టు ఉన్నాది నాకు
చంద్రలేఖవా.. శశిరేఖవా..బాటసారివా..కాళిదాసువా

చరణం 2:

ఆహాహా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆహాహా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ
రోజు రోజు కదీ మరీ దగ్గరవుతది
మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ
రోజు రోజు కదీ మరీ దగ్గరవుతది

ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ
నువ్వు ఊరుకుంటే మీద పడతది
ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ
నువ్వు ఊరుకుంటే మీద పడతది

మీద పడతదీ.. మోజుపడతదీ.. పెళ్ళి మోజు పడతది
గట్టి పడతదీ.. కట్టమంటది.. తాళి కట్టమంటది

ఎక్కడో.. ఓ ఓ ఓ......ఎప్పుడో.. ఓ ఓ ఓ...
ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు
ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు
బాలరాజువా.. దేవదాసువా.. భద్రకాళివా.. చండీప్రియవా

ఎక్కడో.. ఓ ఓ ఓ......ఎప్పుడో.. ఓ ఓ ఓ...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1864

Friday, November 15, 2013

చేరేదెటకో తెలిసి

చిత్రం  :  ప్రేమ బంధం (1976)
సంగీతం  : కె.వి. మహదేవన్
గీతరచయిత  : వేటూరి
నేపధ్య గానం  : బాలు, సుశీల


పల్లవి:

ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁహూఁ
లాల లార రరా..రా.రా..రా..రా ఊఁహూఁ..

చేరేదెటకో తెలిసి.. చేరువకాలేమని తెలిసి

చెరిసగమైనామందుకో..ఓ..ఓ..ఓ తెలిసి..తెలిసి..తెలిసి

కలవని తీరాల నడుమ.. కలకల సాగక యమునా

వెనుకకు తిరిగి పోయిందా... మనువు గంగతో మానిందా?
ఊఁ..ఊఁహూఁ.. ఊఁహూ..
చేరేదెటకో తెలిసి ..చేరువకాలేమని తెలిసి
చెరిసగమైనామందుకే..ఏ..ఏ..ఏ
తెలిసి..తెలిసి..తెలిసి..


చరణం 1:

జరిగిన కథలో బ్రతుకు తెరువులో.. దారికి అడ్డం తగిలావూ..ఊ..ఊ
ముగిసిన కథలో మూగ బ్రతుకులో..ఓ.. నా దారివి నీవై మిగిలావూ..ఊ

పూచి పూయని పున్నమలో.. ఎద దోచి తోడువై పిలిచావు

గుండెలు రగిలే ఎండలలో.. నా నీడవు నీవై నిలిచావు
ఆ..ఆ..ఆఅ..ఆఅ..ఆఅ


చేరేదెటకో తెలిసి.. చేరువకాలేమని తెలిసి
చెరిసగమైనామందుకే..ఏ..ఏ..ఏ
తెలిసి..తెలిసి... తెలిసి..


చరణం 2:


తూరుపు కొండల తొలి తొలి సంధ్యల... 
వేకువ పువ్వు వికసిస్తుందీ..ఈ..ఈ..ఈ

విరిసిన పువ్వూ..ఊ..ఊ.. కురిసిన తావి...
విరిసిన పువ్వూ... కురిసిన తావి
మన హృదయాలను వెలిగిస్తుంది..ఈ..ఈ..ఈ
చీకటి తెరలు తొలిగిస్తుంది

ఊఁహుఁ..ఊఁహూఁ..అహ అహా..ఆహ ఆహా...ఆ..ఆ




ఇది ఎన్నడు వీడని కౌగిలి

చిత్రం : ప్రేమ జీవులు (1971)
సంగీతం : విజయ కృష్ణమూర్తి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు

పల్లవి :

ఇది ఎన్నడు వీడని కౌగిలి
మన ఎదలను కలిపిన రాతిరి
విరబూసెను నేడే అనురాగం
కరుణించెను తానే ఆ దైవం

ఇది ఎన్నడు వీడని కౌగిలి....ఈ..ఈ..ఈ

చరణం 1:

కలువల మించిన నీ కనులు...  చిలికెను నాలో వెన్నెలలు
చిగురుల మించిన నీ తనువు...  చిందెను నాలో నవమధువు

అందాలన్నీ నీవేలే... అందాలన్నీ నీవేలే...
అనుభవమంతా నాదేలేదే...

ఇది ఎన్నడు వీడని కౌగిలి
మన ఎదలను కలిపిన రాతిరి
విరబూసెను నేడే అనురాగం
కరుణించెను తానే ఆ దైవం

ఇది ఎన్నడు వీడని కౌగిలి....ఈ..ఈ..ఈ

చరణం 2:

కోవెల గంటల నాదంలో.. జీవన గానం విందాము
ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..
తీరని వలపుల ఊయలలో ...తీయని కలలే కందాము

ఒకరికి ఒకరు నీడగా... ఒకరికి ఒకరు నీడగా
ఉందాము దైవం తోడుగా... 

ఇది ఎన్నడు వీడని కౌగిలి
మన ఎదలను కలిపిన రాతిరి
విరబూసెను నేడే అనురాగం
కరుణించెను తానే ఆ దైవం

ఇది ఎన్నడు వీడని కౌగిలి....ఈ..ఈ..ఈ

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3054


అందరాని సందమామ నాకెందుకూ

చిత్రం  :  ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం  : చక్రవర్తి
గీతరచయిత  : సినారె
నేపధ్య గానం  : బాలు, సుశీల


పల్లవి :

హే.. అందరాని సందమామ నాకెందుకూ... ఊఁ.. ఊఁ.. ఊఁ.. ఊఁ..
అద్దం లాంటి నా మామ చాలు నాకు.. అద్దం లాంటి నా మామ చాలు నాకు..

హే.. అందరాని సందమామ నీకెందుకూ... ఊఁ.. ఊఁ.. ఊఁ.. ఊఁ..
నే అద్దంలా ఉన్నాను నువ్వు సూసేందుకు.. నే అద్దంలా ఉన్నాను నువ్వు సూసేందుకు..

చరణం 1:

ఏటిలోని నురగల్లాగా.. పైట కొంగు పొంగుతుంటే
లేత గాలి ఇసురుల్లోనా.. పూత వయసు ఊగుతుంటే

ఇసకాతిన్నెలు గుసగుసమంటే.. ఏ..ఏ..ఏ..ఏ.. 
మసకా కోరిక బుస కొడుతుంటే.. ఆ..ఆ..ఆ..ఆ..
ఇసకాతిన్నెలు గుసగుసమంటే.. మసకా కోరిక బుస కొడుతుంటే..

చూడాలి అప్పుడు... ఈ జోడు గుండెల చప్పుడు
చూడాలి అప్పుడు... ఈ జోడు గుండెల చప్పుడు

హాఁ.. అందరాని సందమామ నీకెందుకూ... ఊఁ ఊఁ ఊఁ ఊఁ..
అద్దం లాంటి నా మామ చాలు నాకు.. అద్దం లాంటి నా మామ చాలు నాకు..

చరణం 2:

నీరెండ సీరకట్టి.. నీలి నీడ రైక తొడిగి
పొద్దుపొడుపు తిలకం దిద్ది.. పొన్న పూల నవ్వులు పొదిగి

వనలచ్చిమిలా నువ్వొస్తుంటే.. ఏ..ఏ..ఏ..ఏ..
 ఊరూ నాడు పడి చస్తుంటే.. హాఁ..ఆ..ఆ..ఆ..
వనలచ్చిమిలా నువ్వొస్తుంటే... ఊరూ నాడు పడి చస్తుంటే..

చూడాలి అప్పుడు.. నన్నేలినోడి దూకుడు
చూడాలి అప్పుడు.. నన్నేలినోడి దూకుడు

హే.. అందరాని సందమామ నీకెందుకూ... ఊఁ ఊఁ ఊఁ ఊఁ..
నే అద్దంలా ఉన్నాను... నువ్వు సూసేందుకు..

హే.. అందరాని సందమామ నాకెందుకూ... ఊఁ ఊఁ ఊఁ ఊఁ..
అద్దం లాంటి నా మామ చాలు నాకు.. అద్దం లాంటి నా మామ చాలు నాకు..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7267



మనసున ఉన్నది చెప్పాలనున్నది



చిత్రం  :  ప్రియమైన నీకు (2001)
సంగీతం  : శివ శంకర్
గీతరచయిత  : సిరివెన్నెల
నేపధ్య గానం  : చిత్ర

పల్లవి:

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
ఒకసారి దరి చేరి ఎద గొడవేమిటో తెలపకపోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా

ల.....

చరణం 1:

చింత నిప్పైనా చల్లగ ఉందని ఎంత నొప్పైన తెలియలేదని
తననే తలచుకొనే వేడిలో
ప్రేమ అంటేనే తీయని బాధని
లేత గుండెల్లో కొండంత బరువని
కొత్తగా తెలుసుకొనే వేళలో....

కనపడుతోందా నా ప్రియమైన నీకు నా ఎద కోత... అని అడగాలని
అనుకుంటు తన చుట్టు మరి తిరిగిందని.. తెలపకపోతే ఎలా

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా...

చరణం 2:

నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి 
నాకింక చోటెక్కడుందని ... నిదరే కసురుకొనే రేయిలో
మేలుకొన్నాయిలే వింత కైపని వేల ఊహల్లో ఊరేగే చూపుని
...కలలే ముసురుకొనే హాయిలో

వినబడుతోందా నా ప్రియమైన నీకు... ఆశల రాగం అని అడగాలని
పగలేదో...  రేయేదో.. గురుతేలేదని... తెలపకపోతే ఎలా

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
ఒకసారి దరి చేరి ఎద గొడవేమిటో తెలపకపోతే ఎలా....

ల.... ల... ల...ల.....ల....ల...ల...ల....

గుండె ఝల్లుమన్నదీ

చిత్రం : ప్రాణమిత్రులు (1967)
సంగీతం : కె.వి. మహదేవన్
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

గుండె ఝల్లుమన్నదీ... అందె ఘల్లు మన్నదీ
గుండె ఝల్లుమన్నదీ... అందె ఘల్లు మన్నదీ
మూగమనసు పరవశించి పాడమన్నదీ
నాట్యమాడమన్నదీ ..ఈ..ఈ...

గుండె ఝల్లుమన్నదీ ....

చరణం 1:

ఇన్నాళ్ళకు కలిగినదీ ఈ తొలిహాయీ
అమావాస్య చీకట్లో వెన్నెల రేయి
ఇన్నాళ్ళకు కలిగినదీ ఈ తొలిహాయీ
అమావాస్య చీకట్లో వెన్నెల రేయి

ఎన్నాళ్లకు విన్నానూ నీ తొలి పిలుపు...
ఎన్నాళ్లకు విన్నానూ నీ తొలి పిలుపు
నిదురించిన కోరికలకు ఇదే మేలు కొలుపు....

గుండె ఝల్లుమన్నదీ... అందె ఘల్లు మన్నదీ
మూగమనసు పరవశించి పాడమన్నదీ
నాట్యమాడమన్నదీ ..ఈ..ఈ...
గుండె ఝల్లుమన్నదీ....

చరణం 2:

చెక్కిలితో ఒక చెక్కిలి చేరును నేడు
నా సిగలో విరజాజులు నవ్వును నేడు
చెక్కిలితో ఒక చెక్కిలి చేరును నేడు
నా సిగలో విరజాజులు నవ్వును నేడు

కౌగిలిలో ఒక స్వర్గం ఊగును నేడు
కౌగిలిలో ఒక స్వర్గం ఊగును నేడు...
నా పెదవుల నవమధువులు తొణుకును నేడు..

గుండె ఝల్లుమన్నదీ... అందె ఘల్లు మన్నదీ
మూగమనసు పరవశించి పాడమన్నదీ
నాట్యమాడమన్నదీ ..ఈ..ఈ...
గుండె ఝల్లుమన్నదీ...  

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1222

Thursday, November 14, 2013

యాతమేసి తోడినా

చిత్రం : ప్రాణం ఖరీదు (1978)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  జాలాది

నేపధ్య గానం :  బాలు



పల్లవి :


యాతమేసి తోడినా యేరు ఎండదు 

పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు 

యాతమేసి తోడినా యేరు ఎండదు

పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు 



దేవుడి గుడిలోదైనా... పూరి గుడెసలోదైనా

గాలి ఇసిరికొడితే...ఏ...ఏ...ఏ...

ఆ దీపముండదూ..ఊ...ఊ... ఆ దీపముండదూ...



యాతమేసి తోడినా యేరు ఎండదు 

పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు 



చరణం 1 :




పలుపు తాడు మెడకేత్తే పాడి ఆవురా...ఆ...

పసుపు తాడు ముడులేత్తే ఆడదాయెరా...ఆ...



కుడితి నీళ్లు పోసినా...ఆ..ఆ...ఆ

అది పాలు కుడుపుతాదీ...ఈ...ఈ...ఈ ఈ...ఈ

కడుపుకోతకోసినా...ఆ...ఆ.. ఆ...ఆ...

అది మనిషికే జన్మ ఇత్తాదీ... ఈ...



బొడ్డు పేగు తెగిపడ్డా  రోజు తలుసుకో..

గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో... 



యాతమేసి తోడినా యేరు ఎండదు 

పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు





చరణం 2 :




అందరూ నడసొచ్చిన తోవ ఒక్కటే...
సీమునెత్తురులు పారే తూము ఒక్కటే... 


మేడ మిద్దెలో ఉన్నా...ఆ..ఆ...ఆ ఆ...ఆ
సెట్టునీడ తొంగున్నా..ఆ....ఆ...ఆ
నిదర ముదరపడినాకా..ఆ..ఆ..ఆ..
పాడె ఒక్కటే... హ హ.. వల్లకాడు ఒక్కటే..


కూతునేర్చినోల్ల కులం కోకిలంటరా..హ..హ
ఆకలేసి అరసినోళ్లు కాకులంటరా..   



యాతమేసి తోడినా యేరు ఎండదు 

పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4838

ఓలమ్మో తిరుణాల గిలకా

చిత్రం : ప్రాణం ఖరీదు (1978)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :  జాలది
నేపధ్య గానం :  జి. ఆనంద్, సుశీల

పల్లవి:

యేలియల్లో..యేలియల్లో ఎందాకా..ఆ..ఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా...
యేలియల్లో..యేలియల్లో ఎందాకా..ఆ..ఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా...

ఓలమ్మో తిరుణాల గిలకా
వగలాడి వయ్యరి మొలకా..
ఓలమ్మో తిరుణాల గిలకా
వగలాడి వయ్యరి మొలకా..

ఎన్నెల్లో ఇళ్లేయనా..ఆ..ఆ... చుక్కల్లో పక్కేయనా... 
ఎన్నెల్లో ఇళ్లేయనా..ఆ..ఆ... చుక్కల్లో పక్కేయనా...

గోరంకా గోరంకా తుమ్మెదా..ఆ..ఆ
గీరెక్కిపోయింది తుమ్మెదా..ఆ..ఆ...
గోరంకా గోరంకా తుమ్మెదా..ఆ..ఆ
గీరెక్కిపోయింది తుమ్మెదా..ఆ..ఆ...

ఓరయ్య చంద్రయ్య కొడకా..పొద్దెల్లే నాయింట పడకా..ఆ..ఆ 
ఓరయ్య చంద్రయ్య కొడకా..పొద్దెల్లే నాయింట పడకా..ఆ..ఆ
ఆ..మూడు ముళ్లెయ్యరా..నూరేళ్ల పడకేయరా..
ఆ..మూడు ముళ్లెయ్యరా..నూరేళ్ల పడకేయరా..

చరణం 1:

ఆలమబ్బు బుగ్గల మీద.. మెరెపు మెరిసి ఆడినట్టే..
నీలికొండ గుండెల మీద.. వాన చుక్క జారినట్టే..

వానచుక్క వాగులైయీ... సముద్రాన కలిసినట్టే... 
వానచుక్క వాగులైయీ... సముద్రాన కలిసినట్టే...
రోజువారి మోజులన్నీ....మేజువాణి ఆడినట్టే
ఓరయ్య నేనాడుకోనా... వడినిండా నేనుండి పోనా....
ఓరయ్య నేనాడుకోనా... వడినిండా నేనుండి పోనా....

యేలియల్లో..యేలియల్లో ఎందాకా..ఆ..ఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా...

చరణం 2:

రేతిరంతా నిద్దరకాచి.. కలువపూలు నవ్వినట్టే
రేపుమాపు ఆకాశం... ఆకువక్క యేసినట్టే

పడమటేపు పడకేసి... సూరిగాడు దొర్లినట్టే 
పడమటేపు పడకేసి... సూరిగాడు దొర్లినట్టే 
ఊరివైపు తలుపు తీసి తొంగి చూసి నవ్వినట్టే...
సంధెల్లో చిందేయనా... పొద్దెల్లే ముద్దెట్టనా... 
సంధెల్లో చిందేయనా... పొద్దెల్లే ముద్దెట్టనా... 

ఓరయ్య చంద్రయ్య కొడకా..పొద్దెల్లే నాయింట పడకా..ఆ..ఆ 
ఓరయ్య చంద్రయ్య కొడకా..పొద్దెల్లే నాయింట పడకా..ఆ..ఆ
ఎన్నెల్లో ఇళ్లేయనా..ఆ..ఆ... చుక్కల్లో పక్కేయనా...
ఆ..మూడు ముళ్లెయ్యరా..నూరేళ్ల పడకేయరా..

యేలియల్లో..యేలియల్లో ఎందాకా..ఆ..ఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా...
యేలియల్లో..యేలియల్లో ఎందాకా..ఆ..ఆ
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా...


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9600