Wednesday, January 22, 2014

చెల్లాయి పెళ్ళి కూతురాయెను

చిత్రం : బంగారు గాజులు (1968)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి:

చెల్లాయి పెళ్ళి కూతురాయెను
పాల వెల్లువే నాలో పొంగిపోయెను
చెల్లాయి పెళ్ళి కూతురాయెను
పాల వెల్లువే నాలో పొంగిపోయెను

చరణం 1:

నా చెల్లి మందారవల్లి
అది నను గన్న బంగారు తల్లి
నా చెల్లి మందారవల్లి
అది నను గన్న బంగారు తల్లి
ఎన్నెన్ని జన్మలైనగాని
నాకీ చెల్లి కావాలి, మళ్ళీ మళ్ళీ

చెల్లాయి పెళ్ళి కూతురాయెను
పాల వెల్లువే నాలో పొంగిపోయెను

చరణం 2:

బంగారు గాజులు తొడుగుకొని
సిగలో అందాల జాజులు తురుముకొని
బంగారు గాజులు తొడుగుకొని
సిగలో అందాల జాజులు తురుముకొని
పెళ్ళి పీటపై చెల్లి కూర్చోవాలి
నా కళ్ళల్లో వెలగాలి దీపావళి

చెల్లాయి పెళ్ళి కూతురాయెను
పాల వెల్లువే నాలో పొంగిపోయెను

చరణం 3:

చిన్నారి చెల్లికి పెళ్ళయితే
నా పొన్నారి బావతో వెళుతుంటే
ఈ అన్నయ్య కన్నీరు ఆగేనా..ఆ..
ఈ అన్నయ్య కన్నీరు ఆగేనా
అది పన్నీటి వాగై సాగేనా

చెల్లాయి పెళ్ళి కూతురాయెను
పాల వెల్లువే నాలో పొంగిపోయెను
చెల్లాయి పెళ్ళి కూతురాయెను
పాల వెల్లువే నాలో పొంగిపోయెను

No comments:

Post a Comment