Monday, January 13, 2014

ఏవిటోగా ఉంది

చిత్రం : బంగారు కానుక (1982)
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

ఏవిటోగా ఉంది... ఏదో అడగాలని ఉంది...
ఏదో కావాలని... తెలియక తికమకగా ఉంది...
ఏవిటోగా ఉంది... ఏదో అడగాలని ఉంది...
ఏదో కావాలని... తెలియక తికమకగా ఉంది...
అది ఏవిటో..ఓ..ఓ..నీకు తెలుసా మిస్...

ఏవిటోగా ఉంది... ఎదలో సొదగా ఉంది...
ఏదో కావాలని... నిన్నే అడగాలని ఉంది...
ఏవిటోగా ఉంది... ఎదలో సొదగా ఉంది...
ఏదో కావాలని... నిన్నే అడగాలని ఉంది...
అది ఏమిటో....ఓ..ఓ...నీకు తెలుసా మిస్టర్....

చరణం 1:

అది ఇదీ అని చెప్పలేనీ... మూగమనసుతో...
అది అదే అని చెప్పుకోనీ... కోడెవయసుతో...
అది ఇదీ అని చెప్పలేనీ... మూగమనసుతో...
అది అదే అని చెప్పుకోనీ... కోడెవయసుతో...
మంచుతెరలు తొలగించాలని.. మల్లెపూలు నలిపేయ్యాలని...
మంచుతెరలు తొలగించాలని.. మల్లెపూలు నలిపేయ్యాలని...
కసి కసిగా.. ఉసి ఉసిగా...రెపరెప తపనల అలజడిగా...

ఏవిటోగా ఉంది...ఎదలో సొదగా ఉంది...
ఏదో కావాలని... నిన్నే అడగాలని ఉంది...
అది ఏమిటో..ఓ..ఆ..నీకు తెలుసా మిస్......

చరణం 2:

శృతి మరీ మించుతున్న కొత్త లయలతో...హాయ్..
రుచులేవో కోరుతున్నా మత్తు పెదవితో...
శృతి మరీ మించుతున్న కొత్త లయలతో...ఓ..ఓ..
రుచులేవో కోరుతున్నా మత్తు పెదవితో...
ఎదకు నిన్ను అదిమెయ్యాలని... ఎల్లలన్ని చిదిమెయ్యాలని...
ఎదకు నిన్ను అదిమెయ్యాలని... ఎల్లలన్ని చిదిమెయ్యాలని...
తడి తడిగా పొడి పొడిగా...తహ తహలాడిన సందడిగా...

ఏవిటోగా ఉంది... ఏదో అడగాలని ఉంది...
ఏదో కావాలని తెలియక తికమకగా ఉంది...
అది ఏవిటో..ఓ..ఓ..నీకు తెలుసా మిస్...

హు..ఏవిటోగా ఉంది...ఎదలో సొదగా ఉంది...
ఏదో కావాలని... నిన్నే అడగాలని ఉంది...
అది ఏమిటో..ఓ..ఓ...నీకు తెలుసా మిస్టర్....

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1875

No comments:

Post a Comment