Tuesday, January 28, 2014

నిండు చందమామా

చిత్రం : బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఏసుదాస్

పల్లవి:

ఓ నిండు చందమామా … నిగనిగల భామా
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామా

చరణం 1:

నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే
నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే
మేలుకొన్న స్వప్నంలోన ఏల ఇంత బిడియపడేవు
మేలుకొన్న స్వప్నంలోన ఏల ఇంత బిడియపడేవు
ఏలుకునే ప్రియుడను కానా లాలించగ సరసకు రానా
ఓఓఓఓఓ… ఓ నిండు చందమామా … నిగనిగల భామా
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామా

చరణం 2:

దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే
నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే
నేటినుంచి మేనులు రెండూ నెరజాణా ఒకటాయే..
ఓఓఓఓఓ… ఓ నిండు చందమామా … నిగనిగల భామా
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7021


No comments:

Post a Comment