Wednesday, February 26, 2014

ఎన్నెన్ని వంపులు


చిత్రం :  బాబు (1975)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :



ఏయ్.. బాబూ.. నిన్నే..
ఊ.. హు.. బాగుందా..?
అబ్బా.. ఎంత బాగుంది..
ఎంతా...?
ఎంతో...ఓ..ఓ..
హ్హ హ్హ హ్హ.. ఎంతో అంటే..?
హ్హ హ్హ హ్హ.. ఊ..ఊ...ఊ.. ఇంత..
హ్హ హ్హ హ్హ.. హ్హ హ్హ హ్హ


ఎన్నెన్ని వంపులు.. ఎన్నెన్ని సొంపులు..
ఎన్నెన్ని వంపులు.. ఎన్నెన్ని సొంపులు... నాకున్నవేమో రెండే కన్నులు
ఎలా.. ఎలా.. ఎలా చూసేది?.. ఏది చూసేది?
ఎలా చూసేది..? ఏది చూసేది?


చాలకుంటే...
ఆ..హా..
కావాలంటే...
ఓహో..
చాలకుంటే.. కావాలంటే.. నావి కూడ తీసుకో..
తనివి తీరా చూసుకో..
నీ తనివి తీరా చూసుకో..


చరణం 1 :



ఆ...హా.. ఆ..హా. ఆ..హా..హా..ఆ..హా...హా..హా
ఓ..హో.. ఓ..హో..ఓ..హా హా ఓ..హో..హా..హా
ఈ ఎరుపు బాగుందా.. తెలుపు కుదిరిందా?
ఈ ఎరుపు బాగుందా.. తెలుపు కుదిరిందా?


ఎరుపులో నీ వయసుంది.. ఆ హా...
తెలుపులో నీ మనసుంది..
ఎరుపు తెలుపులు నన్ను నిలువునా నలుపుతున్నాయి..
అమ్మొమ్మో.. ఎదలో సలుపుతున్నాయి..


ఎన్నెన్ని వంపులు.. ఎన్నెన్ని సొంపులు... నాకున్నవేమో రెండే కన్నులు
చాలకుంటే.. కావాలంటే.. నావి కూడ తీసుకో..
తనివి తీరా చూసుకో.. నీ తనివి తీరా చూసుకో..


చరణం 2 :



పంతులమ్మ.. పంతులమ్మా కొత్త చదువు నేర్పుతావా
దర్జీ దొరా.. దర్జీ దొరా.. వలపు కొలత తీస్తావా..
నింగీ నేలా.. నిండు మనసు.. నీకు నాకూ వలపు కొలత
కొలతలన్నీ చెరిపి వేసే.. చెలిమిలోనే కొత్త చదువు




ఎన్నెన్ని వంపులు.. ఎన్నెన్ని సొంపులు... నాకున్నవేమో రెండే కన్నులు
ఎలా.. ఎలా.. ఎలా చూసేది..?
ఎలా చూసేది..? ఏది చూసేది..?



చరణం 3 :



నీ చిలిపి కన్నుల్లో.. చిగురు పెదవుల్లో..
నవ్వు నువ్వై నిలవాలి.. నువ్వు నేనై కలవాలి
కనులు.. పెదవులు.. కలిసి మెలిసి కౌగిలించాలి..
అమ్మొమ్మో.. కరిగి పోవాలి.. 


ఎన్నెన్ని వంపులు.. ఎన్నెన్ని సొంపులు... నాకున్నవేమో రెండే కన్నులు
చాలకుంటే..కావాలంటే.. నావి కూడ తీసుకో..
తనివి తీరా చూసుకో..
నీ తనివి తీరా చూసుకో..



2 comments:

  1. ఎంతో సమయాన్ని వెచ్చించి మీరు చేస్తున్న ఈ ప్రయత్నం శతధా సహస్రధా అభినందనీయం రసజ్ఞ గారూ.
    ధన్యవాదాలండీ మీకు

    ReplyDelete