Thursday, February 27, 2014

మానవుడే మహనీయుడు

చిత్రం :  బాల భారతం (1972)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల

పల్లవి:

మానవుడే మహనీయుడు... మానవుడే మహనీయుడు
శక్తియుతుడు యుక్తిపరుడు... మానవుడే మాననీయుడు
మానవుడే... మహనీయుడు

చరణం 1:

మంచిని తలపెట్టినచో మనిషికడ్డు లేదులే...
ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే...
మానవుడే మహనీయుడు... మానవుడే మహనీయుడు

చరణం 2:

దివిజ గంగ భువిదించిన భగీరథుడు... మానవుడే ...
సుస్ధిర తారగ మారిన ధ్రువుడు కూడ... మానవుడే...
సృష్టికి ప్రతిసృష్టి చేయు విశ్వామిత్రుడు... నరుడే...
జీవకోటి సర్వములో శ్రేష్ఠతముడు ...మానవుడే...
మానవుడే మహనీయుడు... మానవుడే మహనీయుడు

చరణం 3:

గ్రహరాశులనధిగమించి... ఘనతారల పథమునుంచి ...
గ్రహరాశులనధిగమించి... ఘనతారల పథమునుంచి ...
గగనాంతర రోదసిలో...ఓ... గంధర్వగోళకతుల దాటి ...

చంద్రలోకమైన... దేవేంద్రలోకమైన...
చంద్రలోకమైన... దేవేంద్రలోకమైన...
బొందితో జయించి మరల భువికి తిరిగిరాగలిగే...
మానవుడే మహనీయుడు...
శక్తియుతుడు యుక్తిపరుడు... మానవుడే మాననీయుడు
మానవుడే మహనీయుడు...మానవుడే మహనీయుడు

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7575

No comments:

Post a Comment