Wednesday, March 19, 2014

తగునా వరమీయా

చిత్రం :  భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శన్
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:


తగునా వరమీయా ఈ నీతి దూరునకు.. పరమా పాపునకూ
తగునా వరమీయా ఈ నీతి దూరునకు.. పరమా పాపునకూ
స్నేహముమీరగ నీవేలగా ద్రోహము నే చేసితీ
స్నేహముమీరగ నీవేలగా ద్రోహము నే చేసితీ
పాపకర్ము దుర్మదాంధు నన్ను సేపక దయ చూపి నేలా...
హర... తగునా వరమీయా ఈ నీతి దూరునకు పరమా పాపునకూ


చరణం 1:


మంగళదాయిని మాతపార్వతిని మతిమాలి మోహించితీ
మంగళదాయిని మాతపార్వతిని మతిమాలి మోహించితీ
కన్నులనిండే శూలాన పొడిచీ కామముమాపుమా
కన్నులనిండే శూలాన పొడిచీ కామముమాపుమా


తాళజాలను.. సలిపిన ఘనపాప.. సంతాప భరమీనిక
చాలును.. కడ తేర్చుము ఇకనైన వీని పుణ్యహీన దుర్జన్మము
ఓనాటికి మతి వేరేగతి మరిలేదూ
ఈ నీచుని తల ఇందే తునకలు కానీయ్..
వేణియద వసివాడి
మాడి మసి మసి కానీ
పాపము బాపుమా నీదయ చూపుమా నీదయ చూపుమా...


చరణం 2:


చేకొనుమా దేవా శిరము చేకొనుమా దేవా
శిరము చేకొనుమా దేవా
శిరము చేకొనుమా దేవా..
శిరము చేకొనుమా దేవా ..
చేకొనుమా దేవా శిరము... చేకొను మహాదేవా


మాలికలో మణిగా నిలుపూ
కంఠమాలికలో మణిగా... నిలుపూ
నా పాప
ము తరుగు విరుగు

పాప ఫము తరుగూ విరుగూ...

పాప ము తరుగూ విరుగూ

చేకొనుమా దేవా శిరము చేకొను మహాదేవా


No comments:

Post a Comment