Showing posts with label ఆర్. సుదర్శన్. Show all posts
Showing posts with label ఆర్. సుదర్శన్. Show all posts

Wednesday, March 19, 2014

సుందరాంగ అందుకోరా

చిత్రం :  భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శన్, ఆర్. గోవర్ధన్
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం:  ఘంటసాల, సుశీల


పల్లవి:


సుందరాంగ అందుకోరా.. సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని.. ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా..
సుందరాంగ అందుకోరా.. సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని.. ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా...


చరణం 1:


కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ.. సంతోషమురెగ చెంత చేర రారా
కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ.. సంతోషమురెగ చెంత చేర రారా
సుందరాంగ అందుకోరా.. సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని.. ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా


చరణం 2:


యోగము చేదు విరాగము చేదు.. అనురాగమే మధురం
చాలు సాధన విడవోయి వేదన.. సంతోషాబ్దికి పోదము
యోగము చేదు విరాగము చేదు.. అనురాగమే మధురం
చాలు సాధన విడవోయి వేదన.. సంతోషాబ్దికి పోదము
అట రంగారు బంగారు మీనాలమై.. చవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం
అట రంగారు బంగారు మీనాలమై..  చవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం
ఏలాడుదాం ఓలాడుదాం ముదమార తనివీర ఈదాడుదాం
ముదమార తనివీర ఈదాడుదాం
సుందరాంగ అందుకోరా.. సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా...


సుందరాంగ అందుకోరా... సుందరాంగ అందుకోరా
సుందరాంగ అందుకోరా... సుందరాంగ అందుకోరా
సుందరాంగ అందుకోరా... సుందరాంగ అందుకోరా
సుందరాంగ అందుకోరా... సుందరాంగ అందుకోరా
సుందరాంగ అందుకోరా... సుందరాంగ అందుకోరా
సుందరాంగ... సుందరాంగ.. సుందరాంగ...
ఓం నమశ్శివాయ.. ఓం నమశ్శివాయ.. ఓం నమశ్శివాయ..


రాముని అవతారం

చిత్రం :  భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శన్, ఆర్. గోవర్ధన్
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  ఘంటసాల


సాకీ : 


ద్వారపాలుర మరల దరిదీయు కృపయో...
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో...ఓ...
రాముని అవతారం... రవికులసోముని అవతారం....


పల్లవి :


రాముని అవతారం ...రవికులసోముని అవతారం
రాముని అవతారం ...రవికులసోముని అవతారం
సుజనజనావన ధర్మాధారం...దుర్జనహృదయవిదారం ...
రాముని అవతారం


చరణం 1:


దాశరథిగ శ్రీకాంతుడు వెలయూ...కౌసల్యాసతి తపము ఫలించూ
జన్మింతురు సహజాతులు మువ్వురు...
జన్మింతురు సహజాతులు మువ్వురు...లక్ష్మణ.. శత్రుఘ్న.. భరతా
రాముని అవతారం ...రవికులసోముని అవతారం


చరణం 2:


చదువులునేరుచు మిషచేత... చాపముదాలిచి చేతా
విశ్వామిత్రుని వెనువెంట ... యాగముకావగ చనునంట
అంతము చేయునహల్యకు శాపము ... అంతము చేయునహల్యకు శాపము
వొసగును సుందర రూపం ...


రాముని అవతారం...రవికులసోముని అవతారం
ధనువో జనకుని మనసున భయమో... ధారుణి కన్యాసంశయమో
దనుజులు కలగను సుఖగోపురమో...
దనుజులు కలగను సుఖగోపురమో...విరిగెను మిథిలానగరమునా
రాముని అవతారం రవికులసోముని అవతారం
కపట నాటకుని పట్టాభిషేకం... కలుగును తాత్కాలిక శోకం
భీకర కానన వాసారంభం ... లోకోద్ధరణకు ప్రారంభం
భరతుని కోరికతీరుచుకోసం ...పాదుకలొసగే ప్రేమావేశం
భరతుని కోరికతీరుచుకోసం ...పాదుకలొసగే ప్రేమావేశం
నరజాతికినవ నవసంతోషం ...గురుజనసేవకు ఆదేశం
రాముని అవతారం రవికులసోముని అవతారం

చరణం 3:

అదిగో చూడుము బంగరు జింకా... అదిగో చూడుము బంగరు జింకా...
మన్నైకనునయ్యో లంకా... హరనయనాగ్ని పరాంగన వంకా...
అరిగిన మరణమె నీకింకా...


రమ్ము రమ్ము హే భాగవతోత్తమ ...వానరకుల పుంగవ హనుమా
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ... వానరకుల పుంగవ హనుమా
ముద్రిక కాదిది భువన నిదానం... ముద్రిక కాదిది భువన నిదానం..
జీవన్ముక్తికి సోపానం... జీవన్ముక్తికి సోపానం


రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకులశోమా...
సీతాశోక వినాశనకారి... లంకావైభవ సంహారి
అయ్యో రావణ భక్తాగ్రేసర అమరంబౌనిక నీ చరిత...
సమయును పరసతిపై మమకారం...వెలయును ధర్మవిచారం
రాముని అవతారం... రవికులసోముని అవతారం
రాముని అవతారం... రవికులసోముని అవతారం



మున్నీట పవళించు

చిత్రం :  భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శన్, ఆర్. గోవర్ధన్
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  ఎం.ఎల్. వసంతకుమారి


పల్లవి:


మున్నీట పవళించు నాగశయన
మున్నీట పవళించు నాగశయన
చిన్నారి దేవేరి సేవలుసేయ
మున్నీట పవళించు నాగశయన..
నీ నాభి కమలాన కొలువు చేసే...ఆ...ఆ...
నీ నాభి కమలాన కొలువు చేసే.. వాణీశు భుజపీటి బరువువేసి
వాణీశు భుజపీటి బరువువేసి...పాల..
మున్నీట పవళించు నాగశయన


చరణం 1:


మీనా కృతి దాల్చినావు..వేదాల రక్షింప
మీనా కృతి దాల్చినావు...
కూర్మా కృతి బూనినావు.. వారిధి మధియింప
కూర్మా కృతి బూనినావు...
కిటి రూపము దాల్చినావు... కనకాక్షు వధియింప
కిటి రూపము దాల్చినావు..
నరసింహమై వెలసినావు ప్రహ్లాదు రక్షింప
నరసింహమై వెలసినావు...
నరసింహమై వెలసినావు...
నటపాల మమునేల జాగేల...
నటపాల మమునేల జాగేల పాల...
మున్నీట పవళించు నాగ శయన...


చరణం 2:


మొహిని విలాస కలిత నవమొహన... మొహదూర మౌనిరాజ మనోమోహనా
మొహిని విలాస కలిత నవమొహన... మొహదూర మౌనిరాజ మనోమోహనా
మందహాస మధురవదన రమానాయక
మందహాస మధురవదన రమానాయక
కోటిచంద్ర కాంతి సదన శ్రీలోల.. పాల
మున్నీట పవళించు నాగశయన
చిన్నారి దేవేరి సేవలుసేయ
మున్నీట పవళించు నాగశయన... 



నీలకంధరా దేవా

చిత్రం: భూకైలాస్ (1958)
సంగీతం: ఆర్. సుదర్శన్
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల


పల్లవి:


జయ జయ మహాదేవా...
శంభో... సదాశివా...
ఆశ్రిత మందారా...
శృతి శిఖర సంచారా...


నీలకంధరా దేవా... దీన బాంధవా రారా... నన్ను గావరా...
నీలకంధరా దేవా... దీన బాంధవా రారా... నన్ను గావరా
సత్య సుందరా స్వామీ... నిత్య నిర్మలా పాహీ...
సత్య సుందరా స్వామీ... నిత్య నిర్మలా పాహీ...
నీలకంధరా దేవా... దీనబాంధవా రారా... నన్ను గావరా...


చరణం 1:


అన్య దైవమూ గొలువా... ఆ... ఆ...
అన్య దైవమూ గొలువా... నీదు పాదమూ విడువా..
అన్య దైవమూ గొలువా... నీదు పాదమూ విడువా
దర్శనమ్ము నీరా... మంగళాంగా గంగాధరా..
దర్శనమ్ము నీరా... మంగళాంగా గంగాధరా
నీలకంధరా దేవా... దీన బాంధవా రారా... నన్ను గావరా...


చరణం 2:


దేహి అన వరములిడు దాన గుణసీమా...
పాహి అన్నను ముక్తినిడు పరంధామ....
నీమమున నీ దివ్య నామ సంస్మరణ...
ఏమరక చేయదును భవ తాపహరణ....
నీ దయామయ దృష్టి దురితమ్ము లారా...
వరసుధా వృష్టినా వాంఛలీడేరా...
కరుణించు పరమేశ దరహాస భాసా...
హర హర మహాదేవ... కైలాస వాసా... కైలాస వాసా...


చరణం 3:


ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా...
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా...
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా...
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా...


కన్నుల విందుగ భక్తవత్సల కానగరావయ్యా...
కన్నుల విందుగ భక్తవత్సల కానగరావయ్యా...
ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా...
ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా...

నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా...

శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా...
శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా...
శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా...

దేవదేవ ధవళాచల మందిర

చిత్రం :  భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శన్
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:


దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమోనమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో

దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమోనమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో


చరణం 1:


పాలిత కింకర భవనాశంకర శంకర పురహర నమోనమో
పాలిత కింకర భవనాశంకర శంకర పురహర నమోనమో
హాలాహలధర శూలాయుధకర శైల సుతావర నమోనమో
హాలాహలధర శూలాయుధకర శైల సుతావర నమోనమో


దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమోనమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో


చరణం 2:


దురిత విమోచనా.. ఆ ఆ ఆ....
దురిత విమోచన ఫాలవిలోచన పరమ దయాకర నమోనమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమోనమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమోనమో 

దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమోనమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో


చరణం 3:


నమోనమో నమోనమో... నమోనమో నమోనమో
నమోనమో నమోనమో... నమోనమో నమోనమో
నమోనమో నమోనమో... నమోనమో నమోనమో


నారాయణ హరి నమోనమో... నారాయణ హరి నమోనమో
నారాయణ హరి నమోనమో... నారాయణ హరి నమోనమో
నారద హృదయ విహారీ నమోనమో...
నారద హృదయ విహారీ నమోనమో...
నారాయణ హరి నమోనమో...
నారాయణ హరి నమోనమో...


పంకజ నయన పన్నగ శయన .. ఆ ఆ ఆ...
పంకజ నయన పన్నగ శయన
పంకజ నయన పన్నగ శయన
శంకర వినుత నమో నమో...
శంకర వినుత నమో నమో...
నారాయణ హరి నమోనమో
నారాయణ హరి నమోనమో
నారాయణ హరి.. నారాయణ హరి... నమో నమో



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8206

తగునా వరమీయా

చిత్రం :  భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శన్
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:


తగునా వరమీయా ఈ నీతి దూరునకు.. పరమా పాపునకూ
తగునా వరమీయా ఈ నీతి దూరునకు.. పరమా పాపునకూ
స్నేహముమీరగ నీవేలగా ద్రోహము నే చేసితీ
స్నేహముమీరగ నీవేలగా ద్రోహము నే చేసితీ
పాపకర్ము దుర్మదాంధు నన్ను సేపక దయ చూపి నేలా...
హర... తగునా వరమీయా ఈ నీతి దూరునకు పరమా పాపునకూ


చరణం 1:


మంగళదాయిని మాతపార్వతిని మతిమాలి మోహించితీ
మంగళదాయిని మాతపార్వతిని మతిమాలి మోహించితీ
కన్నులనిండే శూలాన పొడిచీ కామముమాపుమా
కన్నులనిండే శూలాన పొడిచీ కామముమాపుమా


తాళజాలను.. సలిపిన ఘనపాప.. సంతాప భరమీనిక
చాలును.. కడ తేర్చుము ఇకనైన వీని పుణ్యహీన దుర్జన్మము
ఓనాటికి మతి వేరేగతి మరిలేదూ
ఈ నీచుని తల ఇందే తునకలు కానీయ్..
వేణియద వసివాడి
మాడి మసి మసి కానీ
పాపము బాపుమా నీదయ చూపుమా నీదయ చూపుమా...


చరణం 2:


చేకొనుమా దేవా శిరము చేకొనుమా దేవా
శిరము చేకొనుమా దేవా
శిరము చేకొనుమా దేవా..
శిరము చేకొనుమా దేవా ..
చేకొనుమా దేవా శిరము... చేకొను మహాదేవా


మాలికలో మణిగా నిలుపూ
కంఠమాలికలో మణిగా... నిలుపూ
నా పాప
ము తరుగు విరుగు

పాప ఫము తరుగూ విరుగూ...

పాప ము తరుగూ విరుగూ

చేకొనుమా దేవా శిరము చేకొను మహాదేవా


Friday, August 2, 2013

చిన్నారి పొన్నారి పువ్వు

చిత్రం: నాదీ ఆడజన్మే (1965)
సంగీతం: ఆర్. సుదర్శన్
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

చరణం 1:

ఆహ హా..ఊహు హూ..ల.ల.ల.ల.ల.ల.లా.లా.
ల.ల.ల.ల.ల.ల.లా.లా.

హృదయాన కదలాడు బాబూ
రేపు ఉయ్యాల జంపాలలూగూ

హృదయాన కదలాడు బాబూ
రేపు ఉయ్యాల జంపాలలూగూ

పసివాడు పలికేటి మాటా
ముత్యాల రతనాల మూటా

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

చరణం 2:

ఆహ హా..ఊహు హూ..ల.ల.ల.ల.ల.ల.లా.లా.
ల.ల.ల.ల.ల.ల.లా.లా.

ఒడిలోన పవళించు వేళా
నేను పాడేను ఒక జోల పాటా

ఒడిలోన పవళించు వేళా
నేను పాడేను ఒక జోల పాటా

కనుమూసి నిదురించు బాబూ
కలలందు జోగాడగలడు

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6502