Thursday, March 20, 2014

కనులీవేళ చిలిపిగ నవ్వెను

చిత్రం :  మంగమ్మ శపధం (1965)
సంగీతం :  టి.వి. రాజు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి:


కనులీవేళ చిలిపిగ నవ్వెను
మనసేవేవో వలపులు రువ్వెను
చెలి... నా చెంత నీకింత జాగేలనే
చెలి... నా చెంత నీకింత జాగేలనే
కనులీవేళ చిలిపిగ నవ్వెను..
మనసేవేవో వలపులు రువ్వెను..
ఇక అందాల ఉయ్యాల లూగింతులే
ఇక అందాల ఉయ్యాల లూగింతులే


చరణం 1:


మధుర శృంగార మందార మాల.. కదలి రావేల కలహంస లీల
మధుర శృంగార మందార మాల.. కదలి రావేల కలహంస లీల
రంగు రంగుల బంగారు చిలకా...
రంగు రంగుల బంగారు చిలక... వలచి నీ ముందు వాలిందిలే..ఏ ఏ....
కనులీవేళ చిలిపిగ నవ్వెను... మనసేవేవో వలపులు రువ్వెను
చెలి... నా చెంత నీకింత జాగేలనే
చెలి... నా చెంత నీకింత జాగేలనే


చరణం 2:


చరణ మంజీర నాదాలలోన.. కరగి పోనిమ్ము గంధర్వ బాలా
చరణ మంజీర నాదాలలోన.. కరగి పోనిమ్ము గంధర్వ బాలా
సడలి పోవని సంకెళ్ళు వేసీ.....
సడలి పోవని సంకెళ్ళు వేసి.. సరస రాగాల తేలింతులే.. ఏ ఏ...
కనులీవేళ చిలిపిగ నవ్వెను.. మనసేవేవో వలపులు రువ్వెను
ఇక అందాల ఉయ్యాల లూగింతులే...
ఇక అందాల ఉయ్యాల లూగింతులే... 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=590

No comments:

Post a Comment