Wednesday, March 19, 2014

అందాల నా రాజ అలుకేలరా

చిత్రం :  మంగమ్మ శపధం (1965)
సంగీతం :  టి.వి. రాజు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం :  సుశీల


పల్లవి:


అందాల నా రాజ అలుకేలరా.. ఔనని కాదని అనవేలరా..ఆ..ఆ..
అందాల నా రాజ అలుకేలరా.. ఔననీ.. కాదని అనవేలరా..ఆ..ఆ..
అందాల నా రాజ అలుకేలరా.. ఆ..ఆ..ఆ..ఆ..


చరణం 1:


చందురుడాపైన సందడి చేసేను.. డెందములోలోన తొందర చేసేను..అందని వలపులు గంధము పూసేను..ఆ..ఆ..ఆ..అందని వలపులు గంధము పూసేను.. సుందరి జాలిగ చూసేనురా..ఆ..
అందాల నా రాజ అలుకేలరా...ఆ


చరణం 2:

మరులను చిలికించు చిరునవ్వులేమాయే..

మనసును కవ్వించు కనుసన్నలేమాయే..మదనుని తూపులు మరి మరి పదునాయే..ఆ..ఆ..ఆ..మదనుని తూపులు మరి మరి పదునాయే.. మౌనము చాలించి నన్నేలరా..ఆ..
అందాల నా రాజ అలుకేలరా.. ఔననీ.. కాదని అనవేలరా..అందాల నా రాజ అలుకేలరా.. ఆ..ఆ..ఆ..ఆ..

No comments:

Post a Comment