Wednesday, March 19, 2014

మున్నీట పవళించు

చిత్రం :  భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శన్, ఆర్. గోవర్ధన్
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  ఎం.ఎల్. వసంతకుమారి


పల్లవి:


మున్నీట పవళించు నాగశయన
మున్నీట పవళించు నాగశయన
చిన్నారి దేవేరి సేవలుసేయ
మున్నీట పవళించు నాగశయన..
నీ నాభి కమలాన కొలువు చేసే...ఆ...ఆ...
నీ నాభి కమలాన కొలువు చేసే.. వాణీశు భుజపీటి బరువువేసి
వాణీశు భుజపీటి బరువువేసి...పాల..
మున్నీట పవళించు నాగశయన


చరణం 1:


మీనా కృతి దాల్చినావు..వేదాల రక్షింప
మీనా కృతి దాల్చినావు...
కూర్మా కృతి బూనినావు.. వారిధి మధియింప
కూర్మా కృతి బూనినావు...
కిటి రూపము దాల్చినావు... కనకాక్షు వధియింప
కిటి రూపము దాల్చినావు..
నరసింహమై వెలసినావు ప్రహ్లాదు రక్షింప
నరసింహమై వెలసినావు...
నరసింహమై వెలసినావు...
నటపాల మమునేల జాగేల...
నటపాల మమునేల జాగేల పాల...
మున్నీట పవళించు నాగ శయన...


చరణం 2:


మొహిని విలాస కలిత నవమొహన... మొహదూర మౌనిరాజ మనోమోహనా
మొహిని విలాస కలిత నవమొహన... మొహదూర మౌనిరాజ మనోమోహనా
మందహాస మధురవదన రమానాయక
మందహాస మధురవదన రమానాయక
కోటిచంద్ర కాంతి సదన శ్రీలోల.. పాల
మున్నీట పవళించు నాగశయన
చిన్నారి దేవేరి సేవలుసేయ
మున్నీట పవళించు నాగశయన... 



No comments:

Post a Comment