చిత్రం : భార్య బిడ్డలు (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల
పల్లవి:
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ...
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ....
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ....
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ.....
చరణం 1:
మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి
మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి
తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ.. గొల్లుమన్నాము
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ....
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ....
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ.....
చరణం 2:
మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున
మబ్బు మబ్బు మాటున
ఈ మసక చీకటి చాటున ..
బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ..
వెతుకుతున్నామూ....
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ....
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ.....
చరణం 3:
దారి తప్పి పోతివో...
నీ వారి సంగతి మరచినావో
దారి తప్పి పోతివో...
నీ వారి సంగతి మరచినావో
ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో..రాలేకవున్నావో...
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ....
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ.....
No comments:
Post a Comment