Monday, March 17, 2014

బ్రతుకు పూలబాట కాదు

చిత్రం :  భార్య బిడ్డలు (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల




సాకి : 


లేని బాట వెతుకుతున్న పేద వానికి ….
రాని పాట పాడుకున్న పిచ్చివానికి …..


పల్లవి:


బ్రతుకు పూలబాట కాదు

అది పరవశించి పాడుకునే పాట కాదు

బ్రతుకు పూలబాట కాదు


చరణం 1:


దోబూచులాడుతుంది విధి మనతో...

దొంగాటలాడుతుంది మనసులతో...

దోబూచులాడుతుంది విధి మనతో...

దొంగాటలాడుతుంది మనసులతో...

కనిపించే నవ్వులన్ని నవ్వులు కావు..

అవి బ్రతుకు తెరువు కోసం పెదవులాడు కల్లలు...

బ్రతుకు పూలబాట కాదు

అది పరవశించి పాడుకునే పాట కాదు

బ్రతుకు పూలబాట కాదు...



చరణం 2:


మాటలలో చిక్కుబడి మనసు నలిగిపోతుంది
మనసులేని మాటలనే మనం నమ్ముతున్నది
పలుకలేని ప్రతి గుండె బాధతో నిండినది
ఆ ఆ ఆ......
ఒలికే ప్రతి కన్నీటి చుక్క వెచ్చగా ఉంటుంది..

బ్రతుకు పూలబాట కాదు

అది పరవశించి పాడుకునే పాట కాదు

బ్రతుకు పూలబాట కాదు

చరణం 3:


చీకటిలో వెలుగును చూడ నేర్చుకో...

చమటలో స్వర్గాన్ని సృష్టి చేసుకో...
చీకటిలో వెలుగును చూడ నేర్చుకో...
చమటలో స్వర్గాన్ని సృష్టి చేసుకో....
విధి వ్రాసిన వ్రాతలకు విరుగుడొక్కటే
పదిమందితోటి పంచుకునే రోజు వచ్చుటే .. ఆ రోజు వచ్చులే...


బ్రతుకు పూలబాట కాదు

అది పరవశించి పాడుకునే పాట కాదు

బ్రతుకు పూలబాట కాదు

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1304

No comments:

Post a Comment