చిత్రం : భార్యాభర్తలు (1961) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : శ్రీశ్రీ నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి:
మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం మధురం మధురం ఈ సమయం
చరణం 1:
చల్లని పున్నమి వెన్నెలలో.. ఓ ఓ ఓ ఓ ఓ ... ఎన్నడు వీడని కౌగిలిలో.. ఆ ఆ ఆ ఆ .... చల్లని పున్నమి వెన్నెలలో.. ఎన్నడు వీడని కౌగిలిలో కన్నుల వలపు కాంతులు మెరయగ
మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం మధురం మధురం ఈ సమయం
చరణం 2:
కరగిపోయె పెను చీకటి పొరలూ.. ఊ ఊ ... కరగిపోయె పెను చీకటి పొరలూ తొలగిపోయె అనుమానపు తెరలు.. తొలగిపోయె అనుమానపు తెరలు పరిమళించె అనురాగపు విరులు.. పరిమళించె అనురాగపు విరులు అలరెనే మనసు నందన వనముగ
మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం మధురం మధురం ఈ సమయం
చరణం 3:
సఫలమాయే మన తీయని కలలూ..ఊ ఊ ... సఫలమాయే మన తీయని కలలు జగము నిండె నవజీవన కళలు.. జగము నిండె నవజీవన కళలు పొంగిపొరలె మన కోర్కెల అలలు.. పొంగిపొరలె మన కోర్కెల అలలు భావియే వెలిగె పూవుల బాటగా
మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం మధురం మధురం ఈ సమయం
No comments:
Post a Comment