Tuesday, April 1, 2014

ఆకాశం నీ హద్దురా

చిత్రం :  సొమ్మొకడిది సోకొకడిది (1979)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం : బాలు


పల్లవి:


ఆకాశం నీ హద్దురా... హెయ్.. హెయ్.. తరప్తరప్తర...
అవకాశం వదలొద్దురా...
పరువాల తొలి పొద్దులో... హమేషా.. తమషా.. చెయ్యరా


హా... ఆకాశం నీ హద్దురా.. అవకాశం వదలొద్దురా...
పరువాల తొలి పొద్దులో.. హమేషా.. తమషా... చెయ్యరా...
హమేషా.. తమషా... చెయ్యరా..
ఆకాశం నీ హద్దురా... అవకాశం వదలొద్దురా...


చరణం 1:


నేలవిడిచి సాములెన్నో చెయ్యరా.... మబ్బుల్లో మెరుపంతా నీదిరా..
నిలబడి తాగే నీళ్ళు చేదురా... పరుగెత్తయినా పాలు తాగరా
బ్రతుకంటే బస్తీమే సవాలురా... ప్రపంచమే మాయాబజారురా...
ప్రపంచమే మాయాబజారురా...


హోయ్.... గురిచూసి కొట్టాలిరా... సిరి చూసి పట్టాలిరా...
నీ ఎత్తు ఎదగాలంటే.. ఎత్తులు.. జిత్తులు.. వెయ్యరా...
ఎత్తులు... జిత్తులు... వెయ్యరా...
ఆకాశం నీ హద్దురా... అవకాశం వదలొద్దురా...


చరణం 2:


నుదుటి రాత నువ్వు మార్చి రాయరా... నూరేళ్ళ అనుభవాలు నీవిరా...
అనుకున్నది పొందడమే నీతిరా... మనకున్నది పెంచటమే ఖ్యాతిరా...
మనిషి జన్మ మరువలేని ఛాన్సురా... ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా...
ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా...


హా.. సుడిలోకి దూకాలిరా... కడదాకా ఈదాలిరా...
నీ ఒడ్డు చేరాలంటే... తడాకా... మజాకా... చూపరా...
తడాకా... మజాకా... చూపరా...


హా.. ఆకాశం నీ హద్దురా.. అవకాశం వదలొద్దురా...
పరువాల తొలి పొద్దులో.. హమేషా.. తమషా... చెయ్యరా...

No comments:

Post a Comment