Wednesday, April 2, 2014

వేవేల గోపెమ్మల మువ్వగోపాలుడేచిత్రం : సాగర సంగమం (1982)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, ఎస్. పి. శైలజపల్లవి:


ఆమె:


వే వేల గోపెమ్మల మువ్వగోపాలుడే.. మా ముద్దు గోవిందుడే
మువ్వగోపాలుడే... మా ముద్దు గోవిందుడే
అహ..అన్నుల మిన్నల కన్నుల వెన్నెల
వేణువులూదాడే.. మది వెన్నెలు దోచాడే


అతడు:


అహహ వేవేల గోపెమ్మల మువ్వగోపాలుడే..
మా ముద్దు గోవిందుడే


చరణం 1:


అతడు:

మన్ను తిన్న చిన్నవాడే... 

మిన్ను కన్న వన్నెకాడె..

మన్ను తిన్న చిన్నవాడే... మిన్ను కన్న వన్నెకాడె..


ఆమె:

కన్న తోడు లేనివాడే.... కన్నె తోడు వున్నవాడే

మోహనాల వేణువూదే... మోహనాంగుడితడేనే

మోహనాల వేణువూదే... మోహనాంగుడితడేనే ..


అతడు:

చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తీర్చినాడే

పోతన్న కైతలన్నీ పోతపోసుకున్నాడే...

మా మువ్వగోపాలుడే... మా ముద్దు గోవిందుడే


ఆమె:

ఆ..అహహహ వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే...

మా ముద్దు గోవిందుడే...


చరణం 2:

ఆమె:వేయి పేరులున్నవాడే... 

వేల తీరులున్నవాడే..ఏ...

వేయి పేరులున్నవాడే... వేల తీరులున్నవాడే ...

అతడు:

రాస లీలలాడినాడే... రాయబారమేగినాడే ...

గీతార్థ సారమిచ్చి ...గీతలెన్నో మార్చేనే

గీతార్థ సారమిచ్చి ...గీతలెన్నో మార్చేనే


ఆమె:

నీలమై.. నిఖిలమై... కాలమై... నిలిచాడే

వరదయ్య గానాల.. వరదలై పొంగాడే...

మా మువ్వగోపాలుడే...మా ముద్దు గోవిందుడే


అతడు:

ఆ..అహహహ వేవేల గోపెమ్మల మువ్వగోపాలుడే..

మా ముద్దు గోవిందుడే...


ఆమె:

అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల...వేణువులూదాడే ...

మది వెన్నెలు దోచాడే...


అతడు:

అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల.. వేణువులూదాడే ...

మది వెన్నెలు దోచాడే


ఆమె:

ఆ..అహహహ వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే ...


అతడు:

మా ముద్దు గోవిందుడే...

No comments:

Post a Comment