Friday, April 11, 2014

నిన్నటిదాకా శిలనైనా

చిత్రం :  మేఘసందేశం (1982)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  సుశీల

పల్లవి:

నిన్నటిదాకా శిలనైనా.. నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా..

నీ మమతావేశపు వెల్లువలో.. గోదారి గంగనై పొంగుతు ఉన్నా..ఆ ఆ ఆ...

నిన్నటిదాకా శిలనైనా.. నీ పదము సోకినే గౌతమినైనానిన్నటిదాకా శిలనైనా.. 

చరణం 1:

సరసా సరాగాల సుమరాణినీ.. స్వరసా సంగీతాల సారంగినీ
సరసా సరాగాల సుమరాణినీ.. స్వరసా సంగీతాల సారంగినీ

మువ్వా మువ్వకు ముద్దు మురిపాలు పలుకా
మువ్వా మువ్వకు ముద్దు మురిపాలు పలుకా

మవ్వంపు నటనాల..  మాతంగిణి
కైలాశ శిఖారాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళా రావేల నన్నేలా

నిన్నటిదాకా శిలనైనా.. నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా..

నీ మమతావేశపు వెల్లువలో.. గోదారి గంగనై పొంగుతు ఉన్నా..
ఆ ఆ ఆ...

నిన్నటిదాకా శిలనైనా.. నీ పదము సోకినే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా.. 

చరణం 2:

నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమా ప్రాణాలైనా ప్రియురాలినీ
నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమా ప్రాణాలైనా ప్రియురాలినీ

పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే..
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే..
చిరునవ్వులో నేను సిరిమల్లిని..
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు
చెంత వెలిగే వేళా..  ఈ చింత నీకేలా

నిన్నటిదాకా శిలనైనా.. నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా..

నీ మమతావేశపు వెల్లువలో.. గోదారి గంగనై పొంగుతు ఉన్నా..
ఆ ఆ ఆ...

నిన్నటిదాకా శిలనైనా.. నీ పదము సోకినే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా.. 

No comments:

Post a Comment