Friday, April 11, 2014

ఆకులో ఆకునై పూవులో పూవునై

చిత్రం :  మేఘసందేశం (1982)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :  సుశీల



పల్లవి:


ఆకులో ఆకునై.. పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై.. నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా.. హా.. 
ఎటులైనా ఇచటనే ఆగిపోనా


ఆకులో ఆకునై.. పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై.. నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా.. హా.. 
ఎటులైనా ఇచటనే ఆగిపోనా



చరణం 1:


గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
జలజలని పారు సెల పాటలో తేటినై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై


ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా


చరణం 2:


తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల


చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా.. దాహమా.. చింతలా.. వంతలా
ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడా
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా..
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా..


ఆకులో ఆకునై.. పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై.. నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా.. హా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా...

ఎటులైనా ఇచటనే ఆగిపోనా



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1368

5 comments:

  1. చరణం-1:
    పగడాల చిగురాకు తెరచాటు తేటినై — అనుకుంటానండీ.
    ‘తేటి’ అంటే భ్రమరము.

    చరణం-2:
    చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
    ‘చదలు’ అంటే ఆకాశము, ‘జలదము’ అంటే మబ్బు

    ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడా
    ‘కరణి’ అంటే విధము (manner)

    By the way I attempted it here - http://bit.ly/2WsgSAK
    Hope you like it.

    ReplyDelete
    Replies
    1. చాలా థాంక్స్ మహేష్ గారు! సరి చేశాను. పాట చాలా బాగా పాడారు. అభినందనలండి.___/\__

      Delete
    2. ధన్యవాదాలు అండీ __/\__

      Delete