Sunday, May 11, 2014

నీలి మేఘ మాలవో

చిత్రం :  మదన కామరాజు కథ (1962)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  జి. కృష్ణమూర్తి
నేపధ్య గానం :  పి. బి. శ్రీనివాస్, సుశీల



పల్లవి:


నీలి మేఘ మాలవో... నీలాల తారవో
నీ సోయగాలతో...మదినీ దోచిపోదువో..ఓ ఓ ఓ..


నీలి మేఘ మాలనో...నీలాల తారనో
నా సోయగాలతో...మదినీ ఈ ఈ దోచిపోతినో..ఓ ఓ ఓ..


నీలి మేఘ మాలనో...


చరణం 1:


నీ రాక కోసమే చెలి... నే వేచియుంటినే...
ఆరాటమేలనో ప్రియా... నే చెంత నుంటినే...
ఆనంద మధుర గీతములా.. ఆలపింతమా ఆ ఆ ఆ ...


నీలి మేఘ మాలనో....


చరణం 2:


చివురించు వలపు తీవెల... విరి పూలు పూయగా...
చిరునవ్వు విరుపు లోపల... హరివిల్లు విరియదా...
నెలవంక నావలోన మనము కలసిపోదమా ఆ ఆ ఆ ...


నీలి మేఘ మాలవో...


చరణం 3:


మనలోని కలత మాయమై... మన ఆశ తీరెగా...
అనురాగ రాగమే ఇక...మన రాగమాయెగా....
మనసార ప్రేమ మాధురుల సాగి పోదమా ఆ ఆ ఆ ...


నీలి మేఘ మాలనో... నీలాల తారనో...
నీ సోయగాలతో... మదినీ దోచి పోదువో...


No comments:

Post a Comment