Thursday, May 15, 2014

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి

చిత్రం :  మరణ మృదంగం (1988)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, చిత్ర

పల్లవి:

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

మహా కసి గున్నది భలే రుచిగుంటది

ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దులో ముంచేసే ముద్దులే తడిపేసే కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా...

చరణం 1:

కళ్ళు కళ్ళు కలిసాక కవ్వింతగా
ఒళ్ళు ఒళ్ళు కలిపేది ప్రేమా...
ఒళ్ళు ఒళ్ళు కలిసాక ఓ జంటగా
ఎద ఎద కలిపేది ప్రేమా....
శృంగార వీధిల్లోనా షికారు చేసి
ఊరోళ్ల నోళ్ళలోనా పుకారు వేసి
పరువమే హుషారు పుట్టించి
పరువునే బజారు కెక్కించి
మాటిస్తే వినుకోదు
లాలిస్తే పడుకోదు
చోటిస్తే సరిపోదు
ఊరిస్తే ఊర్కోదు
ఈ చిగురు వలుపు చిలిపి పిలుపు కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

చరణం 2:

మళ్లీ మళ్లీ అంటుంది మారాముగా
ఒల్లోకి వోచి తాకుతుంది ప్రేమా..
తుళ్ళి తుళ్ళి పడుతోంది మర్యాదగా
చెల్లించేయ్ ఆ కాస్త ప్రేమా..

మంచాల అంచుల్లోన మకాము చేసి
మందార గంధాలు ఎన్నో మలాము వేసి
వయస్సుని వసంత మాడించే
మనస్సులో తుళ్ళింత పుట్టించే
చూపుల్తో శ్రుతి కాదు
మాటల్తో మతి రాదు
ముద్దుల్తో సరి కాదు
ముట్టందే చలి పోదు
ఈ మనసు మధన తనువు తపన కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దులో ముంచేసే ముద్దులే తడిపేసే కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..

No comments:

Post a Comment