Sunday, June 29, 2014

పదహారేళ్ళకు నీలో నాలో

చిత్రం :  మరో చరిత్ర (1978)
సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం :  జానకి 


పల్లవి :


పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు


వెన్నెలల్లే విరియ బూసి... వెల్లువల్లే ఉరకలేసే


పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు


చరణం 1:


పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు..
పాటలు పాడిన చిరు గాలులకు...


తెరచాటొసగిన... చెలులు శిలలకు
తెరచాటొసగిన... చెలులు శిలలకు
దీవెన జల్లులు చల్లిన అలలకూ...
కోటి దండాలు... శతకోటి దండాలూ


పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు


చరణం 2:


నాతో కలిసి నడచిన... కాళ్ళకు
నాలో నిన్నే నింపిన... కళ్ళకు
నిన్నే పిలిచే... నా పెదవులకు
నీకై చిక్కిన... నా నడుమునకూ...
కోటి దండాలు... శతకోటి దండాలూ


పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు


చరణం 3:


భ్రమలో లేపిన... తొలి జాములకు
సమయం కుదిరిన... సందె వేళలకు
నిన్నూ నన్ను... కన్న వాళ్ళకు
నిన్నూ నన్ను... కన్న వాళ్ళకూ
మనకై వేచే... ముందు నాళ్ళకూ
కోటి దండాలు... శతకోటి దండాలు.. ఊ..
కోటి దండాలు.. శతకోటి దండాలూ


పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
కోటి దండాలు.. శతకోటి దండాలూ






No comments:

Post a Comment