Friday, June 27, 2014

నల్లనయ్యా.. ఎవరని అడిగావా నన్నూ

చిత్రం :  మా ఇద్దరి కథ (1977)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  సుశీల

పల్లవి:

నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ..
నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ..
మురళిని కాలేను.. పింఛమైనా కాను..
మురళిని కాలేను.. పింఛమైనా కాను..
ఎవరని చెప్పాలీ.. నేనూ.. ఏమని చెప్పాలీ నేనూ..

ఆ..ఆ..ఆ..ఆ.. 

నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ..

చరణం 1:

వలచిన రాధమ్మనూ..ఊ..ఊ.... విరహాన దించావు..
పెంచినమ్మ యశోధనూ..ఊ..ఊ...ఊ... మోసాన ముంచావూ...

నీవు నేర్చినదొకటే.... నిను వలపించుకోవటం..
నాకు తెలియినదొకటే... నా మనసు దాచుకోవటం..
ఏమని చెప్పాలీ నేనూ..ఎవరని చెప్పాలీ..నేనూ..
ఆ..ఆ..ఆ..ఆ..

నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ..

చరణం 2:

వెన్నైనా మన్నయినా...ఆ..ఆ..ఆ..ఆ.. ఒక్కటే అన్నావూ
దొంగవయినా గానీ...ఈ..ఈ..ఈ... దొరవయీ నిలిచావూ..

ఎంతా మరవాలన్నా... మనసును వీడిపోననంటావు..
ఎంతా కలవరించిన.. కంటికి కానరాకున్నావు..
ఏమని చెప్పాలీ నేనూ... ఎవరనీ చెప్పాలీ నేనూ..
ఆ..ఆ..ఆ...ఆ.. 

నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ..
మురళిని కాలేను.. పింఛమైనా కాను..

మురళిని కాలేను.. పింఛమైనా కాను..
ఎవరని చెప్పాలీ.. నేనూ.. ఏమని చెప్పాలీ నేనూ..

ఆ..ఆ..ఆ..ఆ.. 

నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ..

No comments:

Post a Comment