Saturday, June 28, 2014

ఎవ్వరిది ఈ పిలుపు

చిత్రం :  మానస వీణ (1983)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఏసుదాస్, సుశీల


పల్లవి:


ఎవ్వరిది.. ఈ పిలుపు
ఎక్కడిది.. ఈ వెలుగు
ఎవ్వరిది ఈ పిలుపు..
ఎక్కడిది ఈ వెలుగు..


నీవై వెలిగినది..ఈ.. నీలో పలికినది..ఈ..ఈ..
నీవై వెలిగినది..ఈ.. నీలో పలికినది..
పిలిచిన పిలుపెల్లా నాదలై.. ఆ మ్రోగిన
వి..

ఆ రాగాలై.. సాగినవి..
మానసవీణై వెలసినది..


ఎవ్వరిది ఈ వీణా.. ఎక్కడిది ఈ జాణా..
నాలోని.. నీ రూపమే..
ఆ..ఆ..నాలోని.. నీ భావమే...


ఎవ్వరిది ఈ పిలుపు..
ఎక్కడిది ఈ వెలుగు..
నీవై వెలిగినదీ..
నీలో పలికినది..


చరణం 1:


చుక్కల్నీ ఒలిచీ.. చక్కంగా మలిచి..
నీ కంఠహారాన్ని చేయించనా..ఆ..ఆ


సూర్యుణ్ణి అడిగి.. కిరణాలు తొడిగి..
నీ ముంగిటే ముగ్గు వేయించనా..ఆ..ఆ


ప్రాణాలు ఐదు.. నీలోనా ఖైదై.. ఆరోది నీవై జీవించనా
ప్రాణాలు ఐదు.. నీలోనా ఖైదై.. ఆరోది నీవై జీవించనా


ఎవ్వరిది.. ఈ వీణా..
ఆ.. ఎక్కడిది.. ఈ జాణా..
నాలోని నీ రూపమే..
ఆ.. ఆ.. నాలోని నీ భావమే..


చరణం 2:


తనువెల్లా మనసై.. మనసెల్లా కనులై..
నెలలన్నీ దినమల్లే గడిపేయనా..


నాకున్న రుచులు.. నీకున్నా కళలు..
కలబోసి ప్రతిరోజు విందివ్వవా..


నేనివ్వగలది..ఈ.. ఏ జన్మములది..
ఇక ముందు ఎంతో.. మిగిలున్నది..


ఎవ్వరిది ఈ వీణా..
ఎక్కడిది ఈ జాణా..
నాలోని నీ రూపమే..
ఆ..ఆ..నాలోని నీ భావమే..


ఎవ్వరిది ఈ పిలుపు..
ఎక్కడిది ఈ వెలుగు..
నీవై వెలిగినదీ..ఈ..
నీలో పలికినది..ఈ..
నీవై వెలిగినదీ..ఈ..
నీలో పలికినది..


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5092

No comments:

Post a Comment