Tuesday, July 1, 2014

కరుణించు మేరిమాతా

చిత్రం :  మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  పి. లీల


పల్లవి:


కరుణించు మేరిమాతా..  శరణింక మేరిమాత
నీవే..  శరణింక మేరిమాత.. 


కరుణించు మేరిమాతా..  శరణింక మేరిమాత
నీవే..  శరణింక మేరిమాత.. 



చరణం 1:


పరిశుద్ధాత్మ మహిమ.. వరపుతృగంటివమ్మ
పరిశుద్ధాత్మ మహిమ.. వరపుతృగంటివమ్మ
ప్రభు ఏసునాధుకృపచే మా భువికి కలిగే రక్ష..


కరుణించు మేరిమాతా.. శరణింక మేరిమాత
నీవే.. శరణింక మేరిమాత



చరణం 2:


గురి లేని దారిచేరి పరిహాసమాయే బ్రతుకూ..
గురి లేని దారిచేరి పరిహాసమాయే బ్రతుకూ..
క్షణమైన శాంతిలేదే.. దినదినము శోధానాయే


కరుణించు మేరిమాతా.. శరణింక మేరిమాత
నీవే.. శరణింక మేరిమాత..

No comments:

Post a Comment