Tuesday, July 1, 2014

లాహిరి లాహిరి లాహిరిలో

చిత్రం :  మాయాబజార్ (1957)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత  :  పింగళి
నేపధ్య గానం :  ఘంటసాల, పి. లీల


పల్లవి:


లాహిరి లాహిరి లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా


లాహిరి లాహిరి లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా

ఆ... ఆ...ఆ... ఆ...ఆ... ఆ...


చరణం 1:


తారాచంద్రుల విలాసములతో.. విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో
తారాచంద్రుల విలాసములతో.. విరిసే వెన్నెల పరవడిలో..
పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్ల వాయువుల లాలనలో...


లాహిరి లాహిరి లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
ఆ... ఆ...
ఆ... ఆ...


చరణం 2:


అలల ఊపులో తీయని తలపులు... చెలరేగే ఈ కలకలలో.. మిలమిలలో
అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో
మైమరపించే ప్రేమానౌకలో హాయిగ చేసే విహారణలో..


లాహిరి లాహిరి లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
లాహిరి లాహిరి లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా

ఆ... ఆ...ఆ... ఆ...ఆ... ఆ...


చరణం 3:


రసమయ జగమును రాసక్ఱీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో.. మధురిమలో
రసమయ జగమును రాసక్ఱీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో..
ఎల్లరి మనములు ఝల్లన జేసే చల్లని దేవుని అల్లరిలో...


లాహిరి లాహిరి లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
లాహిరి లాహిరి లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా

ఆ... ఆ...ఆ... ఆ...ఆ... ఆ...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=506

No comments:

Post a Comment