Tuesday, July 1, 2014

నీవేనా నను తలచినది

చిత్రం :  మాయాబజార్ (1957)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  ఘంటసాల, పి. లీల


పల్లవి:


నీవేనా...
నీవేనా నను తలచినది...
నీవేనా నను పిలచినది...
నీవేనా నా మదిలో నిలిచి...
హృదయము కలవరపరచినది... నీవేనా...


నీవేలే నను తలచినది...
నీవేలే నను పిలచినది...
నీవేలే నా మదిలో నిలిచి...
హృదయము కలవరపరచినది... నీవేలే...



చరణం 1:


కలలోనే ఒక మెలకువగా... ఆ మెలకువలోనే ఒక కలగా...
కలలోనే ఒక మెలకువగా... ఆ మెలకువలోనే ఒక కలగా...
కలయో నిజమో వైష్ణవమాయో...
తెలిసి తెలియని అయోమయంలో...



నీవేనా నను తలచినది... నీవేనా నను పిలచినది...
నీవేనా నా మదిలో నిలిచి... హృదయము కలవరపరచినది...
నీవేనా...



చరణం 2:


కనుల వెన్నెల కాయించి...  నా మనసున మల్లెలు పూయించి
కనుల వెన్నెల కాయించి...  నా మనసున మల్లెలు పూయించి
కనులను మనసును కరిగించి... మైమరపించి..  నన్నలరించి...



నీవేలే నను తలచినది... నీవేలే నను పిలచినది...
నీవేలే నా మదిలో నిలిచి...హృదయము కలవరపరచినది...
నీవేలే...
నీవేలే...


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1505

No comments:

Post a Comment