Wednesday, August 13, 2014

చెలిమిలో వలపు రాగం

చిత్రం :  మౌన గీతం (1981)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, జానకి


పల్లవి :


చెలిమిలో వలపు రాగం..

వలుపులో మధుర భావం ...

రాగం భావం కలిసే ప్రణయగీతం ...

పాడుకో... ర ప ప పా.. పాడుకో.. ర ప ప పా

పాడుకో....


చెలిమిలో వలపు రాగం..

వలుపులో మధుర భావం ...


చరణం 1 :


ఉయ్యాలలూగినాను... నీ ఊహలో

నెయ్యాలు నేర్చినాను... నీ చూపులో

ఆరాధనై గుండెలో ...

ఆలాపనై గొంతులో...

అలల లాగా... కలల లాగా ...

అలల లాగా.. కలల లాగా.. కదలీ రాదా....


చెలిమిలో వలపు రాగం..

వలుపులో మధుర భావం ...


చరణం 2 :


నులి వెచ్చనైనా తాపం... నీ స్నేహమూ

ఎద గుచ్చుతున్న భావం... నీ రూపమూ

తుది లేని ఆనందము... తొణుకాడు సౌందర్యము

శృతిని చేర్చి... స్వరము కూర్చి..

శృతిని చేర్చి... స్వరము కూర్చి... పదము కాగా...


చెలిమిలో వలపు రాగం..

వలుపులో మధుర భావం ...

రాగం భావం కలిసే ప్రణయగీతం ...

పాడుకో ర ప ప పా పాడుకో ర ప ప పా

పాడుకో....

 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=7516 

No comments:

Post a Comment