Wednesday, August 13, 2014

హే కృష్ణా మళ్ళీ నీవే జన్మిస్తే

చిత్రం :  మొరటోడు (1977)

సంగీతం :   ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత :   సినారె

నేపధ్య గానం :  వాణీ జయరాం

పల్లవి :

హే కృష్ణా....ఆ....హే కృష్ణా...ఆ..

కృష్ణా...ఆ....హే కృష్ణా....ఆ...

మళ్ళీ నీవే జన్మిస్తే...నీ భగవద్గీతే నిజమైతే...

హే కృష్ణా....ఆ...

మళ్ళీ నీవే జన్మిస్తే...నీ భగవద్గీతే నిజమైతే...

ప్రతి సుమవనం బృందావనం....

ప్రతి సుమవనం బృందావనం...

ప్రతి మూగ మౌళీ.... మోహనమురళి

కృష్ణా....ఆ...

మళ్ళీ నీవే జన్మిస్తే...నీ భగవద్గీతే నిజమైతే...

చరణం 1 :

నీవు నేను వేరు కాదు...ఇద్దరు ఊరు వేరు కాదు

నీవు నేను వేరు కాదు... మన ఇద్దరి ఊరు వేరు కాదూ...ఉ...ఉ...

ఆడేది పాడేది నేను కాదు...

నా ఆటలో పాటలో...నీ లయ లేక పోలేదు...

ఆడేది పాడేది నేను కాదు...

నా ఆటలో పాటలో...నీ లయ లేక పోలేదు...

అందరి చూపు నా పైనా...మరి నా చూపేమో నీ పైనా...

కృష్ణా....మళ్ళీ నీవే జన్మిస్తే...నీ భగవద్గీతే నిజమైతే....

చరణం 2 :

గోవులు కాస్తు నీవుంటావు...జీవిత సాగిస్తూ ఉంటావు

గోవులు కాస్తూ నీవుంటావు...నీ జీవిత సాగిస్తు ఉంటావు...ఊ...ఊ...

పలికించు నీ వేణు గీతానికి...ఫలితము ఎన్నడూ కోరుకోవులే నీవు

పలికించు నీ వేణు గీతానికి...ఫలితము ఎన్నడూ కోరుకోవులే నీవు

నీ కథలోనా నేనున్నాను...

నీ కథలోనా నేనున్నాను.....నా కథలోనా నీవున్నావు

కృష్ణా....మళ్ళీ నీవే జన్మిస్తే...నీ భగవద్గీతే నిజమైతే....

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=7234 

No comments:

Post a Comment