Saturday, August 16, 2014

ఎవరో చెప్పారు చిన్నప్పుడు

చిత్రం :  యువరాజు (1982)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :  దాసరి
నేపధ్య గానం :  బాలు,  సుశీల



పల్లవి :


ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
కార్తీక పున్నమి చలిపొద్దులో
కృష్ణా గోదారి నడిబొడ్డులో
ఒక యువరాజు పుట్టాడని
ఒక యువరాజు పుట్టాడని
వాడే వాడే నారాజు అవుతాడని


ఆ ఆ.. ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
వైశాఖ పున్నమి తొలిపొద్దులో
కృష్ణా కావేరి నడిబొడ్డులో
ఒక యువరాణి పుడుతుండని
ఒక యువరాణి పుడుతుండని
ఆమే ఆమే నారాణి అవుతుందని


ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు



చరణం 1 :


కనులనిండుగుంటాయనీ.. కామాక్షి కాదని.. కంచిలో లేదని
ప్రణయానికి రారాజని.. దేవేంద్రుడు కాడని.. స్వర్గంలో లేడని


కనుముక్కు తీరు చూసేటి జోరు
కనుముక్కు తీరు చూసేటి జోరు
ఎవరికీ ఇంకెవరికీ లేదని.. లేనేలేదని
ఆమే ఆమే నారాణి అవుతుందని


ఆ ఆ.. ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు



చరణం 2 :


సిరులున్న చిన్నోడనీ.. శ్రీనివాసు కాడని.. తిరుపతిలో లేడని
చిన్నిముక్కు చిలకమ్మనీ.. చిత్రాంగి కాదని.. చిత్రాలు లేవని


చిరునవ్వు నోరు చిందాడే తీరు
చిరునవ్వు నోరు చిందాడే తీరు
ఎవరికీ ఇంకెవరికీ లేదని.. లేనేలేదని
వాడే వాడే నారాజు అవుతాడని


ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు


వైశాఖ పున్నమి తొలిపొద్దులో
కృష్ణా గోదారి నడిబొడ్డులో
ఒక యువరాణి పుడుతుండని
ఒక యువరాజు పుట్టాడని
ఆమే ఆమే నారాణి అవుతుందని


ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు



No comments:

Post a Comment