Friday, August 22, 2014

చేతికి గాజుల్లా

చిత్రం :  రాధా కళ్యాణం (1981)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  జ్యోతిర్మయి

నేపధ్య గానం :   బాలు


పల్లవి :


చేతికి గాజుల్లా.. కళ్ళకు కాటుకలా

నుదుటికి తిలకంలా.. రాధకు మాధవుడూ..


చేతికి గాజుల్లా.. కళ్ళకు కాటుకలా

నుదుటికి తిలకంలా.. రాధకు మాధవుడూ..


చరణం 1:


మానసమున నీ ప్రణయము మారు మ్రోగగా

కావ్య గానా మాలపించి కవినే నేనైతి

మానసమున నీ ప్రణయము మారు మ్రోగగా
కావ్య గానా మాలపించి కవినే నేనైతి


మధు మాసము చెలి మోమున విరబూయగనే

మధు మాసము చెలి మోమున విరబూయగనే
హావ భావ రాగ తాళములను మేళవించితి


ఏటికి కెరటంలా పాటకు చరణంలా
సీతకు రాముడిలా రాధకు మాధవుడూ..

 

చేతికి గాజుల్లా.. కళ్ళకు కాటుకలా

నుదుటికి తిలకంలా.. రాధకు మాధవుడూ..


చరణం 2:


పూల పరిమళాల గాలి పలుకరించగా

నీలి నీలి మేఘ మాల పరవశించెను

పూల పరిమళాల గాలి పలుకరించగా
నీలి నీలి మేఘ మాల పరవశించెను 


నవనీతపు చెలి హృదయము నను చేరగనే

నవనీతపు చెలి హృదయము నను చేరగనే
అతిశయమున బ్రతుకు వీణ శృతులు చేసెను


పగటికి సూర్యుడిలా రేయికి జాబిలిలా

గౌరికి ఈశునిలా రాధకు మాధవుడూ.. 

 

చేతికి గాజుల్లా.. కళ్ళకు కాటుకలా
నుదుటికి తిలకంలా.. రాధకు మాధవుడూ..


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=5073



2 comments:

  1. మొదటి చరణం లోని ఈ రెండు వాక్యములను సరిచూడగలరు --

    “కావ్య గానమాలపించి కవినేనైతి” మరియు
    “భావ, రాగ, తాళములను మేళవించితి”.

    “హావ, భావ, రాగ, తాళములను ... " తాళంలో సరిపోవడంలేదేమో!

    ReplyDelete
  2. "గౌరికి ఈశునిలా ..." కాబట్టి, ప్రాసను అనుసరిస్తే "పగటికి సూర్యునిలా ..." అనుకుంటా, సరి చూడగలరు.

    ReplyDelete