Tuesday, August 19, 2014

లలిత భావ నిలయ

చిత్రం :  రహస్యం (1967)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  మల్లాది
నేపథ్య గానం :  ఘంటసాల 


పల్లవి :


లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ


లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ
మధువుచిలుకు  గమకమొలుకు వరవీణాపాణీ
మధువుచిలుకు  గమకమొలుకు వరవీణాపాణీ
సుమరదన విధువదన.. దేవి
సుమరదన విధువదన.. దేవి


అంబరాంతరంగ శారదా స్వరూపిని
చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే
అంబరాంతరంగ శారదా స్వరూపిని
చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే


చరణం 1:


శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని
శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని
బింబాధరా.. రవిబింబాంతరా..
బింబాధరా.. రవిబింబాంతరా..
రాజీవ రాజీవిలోలా... రాజీవ రాజీవిలోలా
శ్రీరాజరాజేశ్వరీ  పరమాకామ సంజీవని....
శ్రీరాజరాజేశ్వరీ  పరమాకామ సంజీవని..
శ్రీరాజరాజేశ్వరీ...



చరణం 2:


నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ
నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ
ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ
ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ
అరుణవసన.. అమలహసనా
అరుణవసన.. అమలహసనా
మాలిని...  మనోన్మనీ 


నాదబింధు కళాధరీ బ్రామరీ...
నాదబింధు కళాధరీ బ్రామరీ... పరమేశ్వరీ
నాదబింధు కళాధరీ బ్రామరీ... పరమేశ్వరీ





7 comments:

  1. Adhbhutamaina paataku saahityam telipinanduku dhanyavaadamulu

    ReplyDelete
  2. నమస్కారమండి. ఈపాటలో "మాడినీ" అనే పదం అర్ధం ఏమిటి. తెలుప ప్రార్ధన.

    ReplyDelete
    Replies
    1. మాడినీ = శివుని ఇష్టురాలు. మురుడేశ్వరుడి గా శివున్ని పిలుస్తారు

      Delete
    2. వేరే బ్లాగ్ లో ఈ పాటకి మొత్తం అర్ధం వ్రాశాను... చూస్తారనుకొంటున్నాను.


      http://kuteeravatika.blogspot.com/2017/09/blog-post_29.html

      Delete
  3. Wonderful thanks ఫర్ యొఉర్ గ్రేట్ వర్క్ మట్టిని కరెక్ట్ ???? నేను మానిని అనుకున్నా

    ReplyDelete
  4. తరువాత వచ్చే పద్యము
    జోడించిచండి

    జలజాతాసన వాసవాదులున్ నీ సంకల్పమావంతయున్

    ReplyDelete
  5. నమస్తే 🙏 పైన కామెంట్స్ లో తెలిపిన విధంగా ' మాడిని ' అన్న పదం ఎక్కడ ఉందో తెలియ రాలేదు. కానీ మీ అర్ధ వివరణ బాగుంది.. 👏👏👌 పైన చరణంలో నయనతార అని అది నాయనసార అని అనుకుంటున్నాను.. 🙏👍👍

    ReplyDelete