Tuesday, August 26, 2014

జగదభిరామా రఘుకులసోమా

చిత్రం : రామాలయం (1971)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల 


పల్లవి :


జగదభిరామా రఘుకులసోమా
శరణమునీయవయా....రామా
కరుణను జూపవయా....


జగదభిరామా రఘుకులసోమా
శరణమునీయవయా....రామా
కరుణను జూపవయా....


చరణం 1 :


కౌశికుయాగము కాచితివయ్యా.. రాతిని నాతిగ చేసితివయ్యా
కౌశికుయాగము కాచితివయ్యా.. రాతిని నాతిగ చేసితివయ్యా


హరివిల్లు విరిచి మురిపించి సీతను.. పరిణయమాడిన కళ్యాణరామా
శరణమునీయవయా....రామా... కరుణను జూపవయా....


చరణం 2 :


ఒకటే బాణం ఒకటే మాట.. ఒకటే సతియని చాటితివయ్యా
ఒకటే బాణం ఒకటే మాట.. ఒకటే సతియని చాటితివయ్యా 


కుజనులనణచి సుజనుల బ్రోచిన...ఆ....ఆ...
కుజనులనణచి సుజనుల బ్రోచిన.... ఆదర్శమూర్తివి నీవయ్యా
శరణమునీయవయా....రామా.. కరుణను జూపవయ



జగదభిరామా రఘుకులసోమా.. 

శరణమునీయవయా....రామా కరుణను జూపవయా....

జయ జయరాం జానకిరాం.. జయ జయరాం జానకిరాం
పావననాం మేఘశ్యాం.. జయ జయరాం జానకిరాం
 జయ జయరాం జానకిరాం.. జయ జయరాం జానకిరాం
జయ జయరాం జానకిరాం.. జయ జయరాం జానకిరాం





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8330

No comments:

Post a Comment