Tuesday, August 26, 2014

మంటలు రేపే నెలరాజా

చిత్రం : రాము (1968)
సంగీతం :  ఆర్. గోవర్ధన్
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి :

మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరి తనము నీకేలా

మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరి తనము నీకేలా

వలపులు రేపే విరులారా.. ఈ శిలపై రాలిన ఫలమేమీ

మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరి తనము నీకేలా

చరణం 1:

ఆకాశానికి అంతుందీ.. నా ఆవేదనకు అంతేదీ
ఆకాశానికి అంతుందీ.. నా ఆవేదనకు అంతేదీ
మేఘములోనా మెరుపుంది.. నా జీవితమందునా వెలుగేది
మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరి తనము నీకేలా

చరణం 2 :

తీగలు తెగిన వీణియపై... ఇక తీయని రాగం పలికేనా
తీగలు తెగిన వీణియపై... ఇక తీయని రాగం పలికేనా
ఇసుక ఎడారిని ఎపుడైనా... ఒక చిన్న గులాబి విరిసేనా
మంటలు రేపే నెలరాజా... ఈ తుంటరి తనము నీకేలా

చరణం 3 :

మదిలో శాంతిలేనపుడు... ఈ మనిషిని దేవుడు చేసాడు
సుఖము శాంతి ఆనందం... నా నొసటను వ్రాయుట మరిచాడు

మంటలు రేపే నెలరాజా... ఈ తుంటరి తనము నీకేలా
వలపులు రేపే విరులారా... ఈ శిలపై రాలిన ఫలమేమీ
మంటలు రేపే నెలరాజా... ఈ తుంటరి తనము నీకేలా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=159

No comments:

Post a Comment