Thursday, August 21, 2014

రాముడు అనుకోలేదు

చిత్రం :  రాజ్ కుమార్ (1983)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

ఆనాడు ఎవరూ అనుకోనిది ఇనాడు మనకు నిజమైనది

ఆ రామాయణం... మన జీవన పారాయణం

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు



చరణం 1:



చెలిమనసే శివధనస్సు అయినది తొలిచూపుల వశమైనది

వలపు స్వయంవరమైనపుడు గెలువనిది ఏది

ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని చిరయశమైనది

శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్ని నావి

తొలి చుక్కవు నీవే.. చుక్కాణివి నీవే

తుదిదాకా నీవే.. మరు జన్మకు నీవే

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  

 

జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు



చరణం 2 :



సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం

ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం

సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం

ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం

గతమంటే నీవే కథకానిది నీవే

కలలన్ని నావే కలకాలం నీవే

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ   

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిది ఇనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం... మన జీవన పారాయణం...

లలలలల లలల... లలలలల లలల... లలలలల లలల


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2679

No comments:

Post a Comment