Thursday, August 21, 2014

అల్లిబిల్లి అమ్మాయి

చిత్రం :  రాజాధిరాజు ( 1980)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  బాలు


పల్లవి :


అల్లిబిల్లి అమ్మాయి అందచందాలున్నాయి

ఉన్నవన్ని మెచ్చాను వచ్చానులే..ఏయ్

అల్లిబిల్లి అమ్మాయి అందచందాలున్నాయి

ఉన్నవన్ని మెచ్చాను వచ్చానులే ..హో..


నాజూకులు దాచేసినా నే దోచగా రానా..నా..

అల్లిబిల్లి అమ్మాయి అందచందాలున్నాయి

ఉన్నవన్ని మెచ్చాను వచ్చానులే


చరణం 1 :


లలనా! తగనా? వలలో పడనా? నా...

లలనా తగనా వలలో పడనా...

నీ హంసల నడకల అడుగుల వెంబడి

చిలకల పలుకుల కిల కిల వింటూ

గిర గిర గిర గిర చుట్టు తిరిగేనే .. నే...


మొన్న నిన్ను చూశాను నిన్న కన్ను వేశాను

నేడు దారి కాచాను రేపు చూసుకో .. కో...


చరణం 2 :


హాయ్! మండిపోతోంది నా తాపమే.. ఎండిపోతోంది నా గొంతుకే

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..

మండిపోతోంది నా తాపమే.. ఎండిపోతోంది నా గొంతుకే

ఈ దాహమూ నీ మోహమే తీర్చాలిలే రావే... వే...


ఉడుమూ పట్టు నా పట్టు ఊడగొడతా నీ బెట్టు

నాకు తెలుసు నీ గుట్టు.. ఊ కొట్టవే... ఓ...


చరణం 3 :


మిడిసి పడకే ఒడిసి పడతా...తా

మిడిసీ పడకే ఒడిసీ పడతా.. తా.తా..తా..తా

నీ ముందర కాళ్ళకు బంధం వేస్తా

ముక్కుకు తాడు ఠక్కున వేస్తా

ఎక్కడికెళితే అక్కడికొస్తాలే.. లే...

కల్లబొల్లి కోపాల కస్సుబుస్సుమనబోకే

చిర్రుబుర్రుమంటున్న సింగారివే...

నాజూకులు దాచేసినా నే దోచగా రా..నా..

 

అల్లిబిల్లి అమ్మాయి అందచందాలున్నాయి

ఉన్నవన్ని మెచ్చాను వచ్చానులే

 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=7254 

No comments:

Post a Comment