Thursday, August 21, 2014

గుండెలోన ఒక మాటుంది

చిత్రం :  రాజా (1976)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు,  సుశీల

పల్లవి :

గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంటుంది

ఉండలేకా .. వెలికి రాకా .. ఉబ్బితబ్బిబ్బవుతోంది

చరణం 1:

నిదురలో ఒక కల వచ్చింది .. తెల్లవారే నిజమయ్యింది
నిదురలో ఒక కల ఒచ్చింది అది తెల్లవారే నిజమయ్యింది
ఆ .. ఆ .. ఆ..ఆ.. ఆ .. ఆ ..
నిజం నీతో చెప్పవస్తే నిండు మనసు మూగబోయింది

మూగబోయిన మనసులోనా రాగమేదో ఉంటుంది
ఆ నిజం మనకు తెలిసేలోగా నిదుర మళ్ళీ వస్తుంది

గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంటుంది
ఉండలేకా .. వెలికి రాకా .. ఉబ్బితబ్బిబ్బవుతోంది 

చరణం 2:

ఆడ పిల్లకు పూలు బొట్టూ .. ఆది నుంచీ అందాలు
మనసు ఇచ్చే .. మనిషి వస్తే .. మారుతాయి అర్ధాలు

మనసు ఇచ్చిన మనిషితోటి మనుగడే ఆనందం
నొసట రాత రాసేవాడికే తెలుసు దాని అర్ధం

గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంటుంది
గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంటుంది
ఉండలేకా .. వెలికి రాకా .. ఉబ్బితబ్బిబ్బవుతోంది

గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంటుంది
ఉండలేకా .. వెలికి రాకా .. ఉబ్బితబ్బిబ్బవుతోంది

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2409

No comments:

Post a Comment