Thursday, August 21, 2014

మాట చూస్తే మామిడల్లం

చిత్రం :  రాజా (1976)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు,  సుశీల



పల్లవి:


మాట చూస్తే... మామిడల్లం
మనసు చూస్తే ... పటికబెల్లం
ఆ... మాట చూస్తే... మామిడల్లం
మనసు చూస్తే... పటికబెల్లం
ఓ సొగసులాడి... వెయ్యబోకే వలపు గొళ్ళేం


ఆదిలోనే అట్టహాసం... చిట్టచివరకు కాళ్ళబేరం
ఆదిలోనే అట్టహాసం... చిట్టచివరకు కాళ్ళబేరం
ఓ గడుసువాడా... ఆపవయ్యా ఆర్భాటం 


చరణం 1 :


కస్సుమన్న పడుచుపిల్ల... కన్నులవిందు
ఆ .. కస్సుమన్న పడుచుపిల్ల... కన్నులవిందు
హేయ్... అలిగినప్పుడే ఆడపిల్ల... భలే పసందు


కయయ్మాడితేనే తమరు వియ్యమంటారు
కయయ్మాడితేనే తమరు వియ్యమంటారు...
లేదా... ముందుగానే ఏదేదో ఇవ్వమంటారు
ముందుగానే ఏదేదో ఇవ్వమంటారు ...


మాట చూస్తే... మామిడల్లం
ఆ... మనసు చూస్తే... పటికబెల్లం
ఓ గడుసువాడా... ఆపవయ్యా ఆర్భాటం
తానే తందాన... తానే తందాన
తానే తందాన... తానే తందాన  


చరణం 2 :


ఆకువక్క లేకపోతే... నోరు పండదు
హా... ఆకువక్క లేకపోతే... నోరు పండదు
గోరువంక లేకపోతే... చిలక ఉండదు


ఎండపడిన దేనికైన నీడ ఉండదా
ఎండపడిన దేనికైన నీడ ఉండదా
అహా... ఈ గుండెలోన నీకింత చోటు ఉండదా
ఈ గుండెలోన నీకింత చోటు ఉండదా


మాట చూస్తే ... మామిడల్లం
ఆ... మనసు చూస్తే ... పటికబెల్లం
ఓ గడుసువాడా... ఆపవయ్యా ఆర్భాటం
తానే తందాన... తానే తందాన
తానే తందాన... తానే తందాన  




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2411

No comments:

Post a Comment