Wednesday, September 24, 2014

నాదవినోదము నాట్యవిలాసము

చిత్రం :  సాగర సంగమం (1982)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు,  ఎస్. పి. శైలజ


సాకీ : 


వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ.. వందే పార్వతీ పరమేశ్వరౌ !!
వందే.. పార్వతీప రమేశ్వరౌ... 


పల్లవి :


నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ


భావములో.. ఆ.. భంగిమలో..  ఆ.. గానములో.. ఆ.. గమకములో.. ఆ...
భావములో భంగిమలో గానములో గమకములో ఆంగికమౌ తపమీ గతి సేయగ
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
ఆ...... ఆ...... ఆ......... 


ని మదనిని మదనిసని. రిసనిదని మదద గమమ రిగస

చరణం 1 : 


కైలాసాన కార్తీకాన శివ రూపం... ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
కైలాసాన కార్తీకాన శివ రూపం.. ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
నవరస నటనం .. ద ని స రి స ని స
జతియుత గమనం .. ద ని స రి స ని స


నవరస నటనం.. జతియుత గమనం
సితగిరి చలనం.. సురనది పయనం
భరతమైన నాట్యం .. ఆ....
బ్రతుకు నిత్య నృత్యం .. ఆ
భరతమైన నాట్యం .. ఆ....
బ్రతుకు నిత్య నృత్యం .. ఆ...


తపముని కిరణం.. తామస హరణం
తపముని కిరణం.. తామస హరణం
శివుని నయన త్రయలాశ్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన... నాట్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన.. లాస్యం


నమక చమక సహజం ..ఝం
నటప్రకృతీ పాదజం .. ఝం
నర్తనమే శివకవచం .. చం
నటరాజ పాద సుమ రజం .. ఝం
ధిరనన ధిరనన ధిరనన ధిరననధిర ధిర ధిర ధిర ధిర ధిర..

నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ ఆ..ఆ..ఆ  




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5770

1 comment:

  1. సంగీతం ఇళయరాజా గారు అనుకుంటానండీ. దయచేసి సరి చూడగలరు.

    ReplyDelete