Wednesday, September 24, 2014

తకిట తదిమి తందాన

చిత్రం :  సాగర సంగమం (1982)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు 


పల్లవి :


తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల థిల్లాన
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల థిల్లాన


తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన
శృతిని లయని ఒకటి చేసి...


తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల థిల్లాన
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల థిల్లాన చరణం 1 : 


నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన

తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల వయసే వరసా
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసి తెలియని ఆశల లలలాలలలా
ఏటిలోని అలలవంటి కంటిలోని కలలు కదిపి..
గుండియలను అందియలుగా చేసి...


తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల థిల్లాన
తడబడు అడుగుల తప్పని తరికిటతోం తరికిటతోం తరికిటతోం
తడిసిన పెదవుల రేగిన.. ఆ.. ఆ.. ఆ..
శృతిని లయని ఒకటి చేసి...
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల థిల్లాన ... 


చరణం 2 :పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం

అలరులు కురియగ నాడెనదే.. అలకల కులుకుల అలమేల్ మంగ...
అలరులు కురియగ నాడెనదే.. అలకల కులుకుల అలమేల్ మంగ...
అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెలుగు పాట..
పల్లవించు పద కవితలు పాడి.....

అ... అ.... అ.... అ... అ.... అ.... అ... అ.... అ.... 

తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల థిల్లాన
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన
శృతిని లయని ఒకటి చేసి... 

తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల థిల్లాన 
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5622

1 comment:

  1. సంగీతం ఇళయరాజా గారు అనుకుంటానండీ. దయచేసి సరి చూడగలరు.

    ReplyDelete