చిత్రం : సంకీర్తన (1987)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు
పల్లవి :
వేవేల వర్ణాల... ఈ నేల కావ్యాన
అలలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై
వేవేల వర్ణాల... ఈ నేల కావ్యాన
అలలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై
చరణం 1 :
'ఓ గంగమ్మో పొద్దెక్కిపోతోంది తొరగా రాయే...'
ఓ తల్లీ గోదారి తుళ్లి తుళ్లి పారేటి పల్లె పల్లె పచ్చాని పందిరి
పల్లె పల్లె పచ్చాని పందిరి ...
నిండు నూరేళ్లు పండు ముత్తైవల్లె ఉండు పంటలకేమి సందడీ
పంట పంటాలకేమి సందడి ...
తందైన తందతైన తందైన తందతైన తందైన తందతైయ్యనా .. తయ్య తందైన తందతైయ్యనా
చరణం 2 :
వానవేలితోటి నేల వీణ మీటే... నీలినింగి పాటే వీచెనట
కాళిదాసులాంటి తోచరాసుకున్న.. కమ్మనైన కవితలే ఈ పూలట
ప్రతికదలికలో నాట్యమే కాదా... ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా ...
ఎదకే కనులుంటే...
వేవేల వర్ణాల... ఈ నేల కావ్యాన
అలలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై
వేవేల వర్ణాల... ఈ నేల కావ్యాన
వానవేలితోటి నేలవీణ మీటే నీలినింగి పాటే ఈ చేలట...
ReplyDeleteకాళిదాసులాంటి తోట రాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలట...