Monday, September 22, 2014

పాటకు పల్లవి ప్రాణం

చిత్రం :  సంగీతలక్ష్మి (1966)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల
 



పల్లవి :



ఆ . . . ఆ . . .


పాటకు పల్లవి ప్రాణం.. నా జీవనజీవం గానం
పాటకు పల్లవి ప్రాణం.. నా జీవనజీవం గానం


అహా.. అలా కాదు . . . జీవనజీవం గానం..ఊ..ఊ...
పాటకు పల్లవి ప్రాణం.. నా జీవనజీవం గానం..ఊ..ఊ..
పాటకు పల్లవి ప్రాణం..



చరణం 1 :


సా.....రీ.........గా.........మా......పా దా నీ సా
సరిగమపదని... సప్తస్వరాలూ నా సిరులూ చెలులూ దివ్యవరాలూ
పాటకు పల్లవి ప్రాణం . .


జవ్వని మువ్వల ఘలఘలలూ జలపాతాల జలజలలూ
గువ్వలజంటల కువకువలూ సంగీతానికి శృతులూ.. లయలూ..


పాటకు పల్లవి ప్రాణం..



చరణం 2 :



నేలా నింగీ లాలనలో మావీ మలతి మేళనలో
నేలా నింగీ లాలనలో మావీ మలతి మేళనలో...
నీవే నేనను భావనలో... అనురాగాలే మన రాగాలు...
మన రాగాలే... మన రాజ్యాలు...


పాటకు పల్లవి ప్రాణం.. నా జీవనజీవం గానం..
పాటకు పల్లవి ప్రాణం...

No comments:

Post a Comment